Kavya Maran Car Collection: అమ్మబాబోయ్‌.. కావ్య మారన్ కార్ల కలెక్షన్‌ చూస్తే దిమ్మతిరుగుద్ది!

Kavya Maran Car Collection 2024: కావ్య మారన్ అంటే తెలని వారుంటారా? క్రికెట్‌ చూసే ప్రతి ఒక్కరికి అమె తెలిసి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం సీఈఓ కావ్య మారన్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అయితే సోషల్ మీడియాలో అమె కారు కలెక్షన్‌ వైరల్‌ అవుతోంది. కావ్య మారన్‌ను ప్రపంచంలో ఉన్న ఖరీదైన కార్ల ఎన్నో ఉన్నాయి. ఇందులోని టాప్‌ కార్ల వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

కావ్య మారన్ గ్యారేజీలో కొన్ని అత్యంత ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో ఎంతో ఖరిదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా ఉంది. అయితే ఇప్పటికీ ఈ కారు ఉన్నట్లు ఎవరికి తెలియదు.  

2 /7

ప్రీమియం కార్లంటే కావ్య మారన్‌కు ఎంతో ఇష్టమటా.. ఆమె కొత్తగా వచ్చే ప్రతి కారును కొంటూ ఉంటుందని సమాచారం. అయితే కావ్య మారన్‌కు ఉన్న ప్రత్యేక కార్లేంటో తెలుసుకోండి.

3 /7

ఈ లగ్జరీ సెడాన్ ధర రూ.8 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇది 6.75-లీటర్ V12 ఇంజన్‌తో శక్తిని కలిగి ఉంటుంది. ఇది 563 హార్స్‌పవర్‌తో పాటు 900 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  

4 /7

ప్రీమియం SUVల్లో ఈ బెంట్లీ బెంటాయ్గా ఒకటి. దీని ధర రూ.4 కోట్లకు పైగా ఉంటుంది. ఇది 6.0-లీటర్ W12 ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 600 హార్స్‌పవర్, 900 Nm టార్క్‌ను ఉత్పత్తితో అందుబాటులోకి లభిస్తోంది.  

5 /7

ఈ ఫెర్రారీ రోమా స్పోర్ట్స్ కారు ధర రూ.2.5 కోట్లకు పైగా ఉంటుంది. ఇది 3.9-లీటర్ V8 ఇంజన్‌తో శక్తితో అందుబాటులోకి వచ్చింది. ఇది 570 హార్స్‌పవర్‌తో పాటు 760 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది.  

6 /7

అత్యంత ప్రీమియం సెడాన్‌లలో బిఎమ్‌డబ్ల్యూ ఐ7 ఒకటి. ఇది రూ.1.6 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ కారు 4.4-లీటర్ V8 ఇంజన్‌తో లభిస్తోంది. 

7 /7

అలాగే కావ్య మారన్‌కు పోర్ష్ 911, మెర్సిడీస్-బెంజ్ S-క్లాస్ కార్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా బోలెడు కార్లు వినియోగిస్తున్న తెలుస్తోంది.