Swapna shastra: మీకు కలలో ఇవి కన్పిస్తే గొప్ప అదృష్ట యోగం.. జ్యోతిష్య పండితులు ఏమంటున్నారంటే..?

Swapna shastra phal: మనకు కలలో కన్పించే వాటిని బట్టి జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయని కూడా జ్యోతిష్యులు చెబుతుంటారు. స్వప్నాలు పడిన సమయంను బట్టి కూడా కలల ఫలితాలు ఉంటాయి.

1 /6

జ్యోతిష్య పండితుల ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక గొప్ప అర్ధం దాగి ఉంటుంది. ముఖ్యంగా కలల శాస్త్రం లేదా స్వప్న  శాస్త్రం మన డైలీ లైఫ్ మీద ఎంతో ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 /6

కలలు కూడా బ్రాహ్మీమూహుర్తంలో  పడే కలలు ఎక్కువగా నిజమవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పండితులు అభిప్రాయపడుతుంటారు. అందుకే ఉదయం లేవగానే.. మనకు పడిన కలల గురించి ఎక్కువగా చర్చించుకొవద్దని అంటారు.

3 /6

కొందరికి కలలో గుర్రం మీద, ఏనుగుల మీద స్వారీ చేసినట్లు కలలు పడతాయి. ఇది రాబోయే ఐశ్వర్యానికి ప్రతీక అని చెబుతుంటారు. ఇక మరికొందరికి కలలో పాములు కనపబడతాయి. ముంగీసలు కూడా కనపడుతుంటాయి. దీని వల్ల కొన్నిరకాల ఇబ్బందులు తలెత్తుతాయని అంటారు.

4 /6

ఇక స్వప్నంలో ఎలుగు బంటీ మీద స్వారీ చేసినట్లుకలలు వస్తే, అది మంచిదని కూడా చెప్తారు. అది ఊహించని లక్కీ యోగానికి గుర్తుగా చెబుతారు. కలలో గొడవలు పడినట్లు, స్వప్నం పడితే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో వాగ్వాదానికి దిగోద్దని అంటారు.

5 /6

కలలో ఎవరైన చనిపోయినట్లు కల పడితే.. అలాంటి వారికి కలిగే ఆపద తప్పిపోయినట్లు కూడా చెబుతుంటారు. కలలో ప్రమాదాలు జరిగితే.. వెంటనే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకొవాలి..

6 /6

కలలో కనుక.. ఎవరికైన మలం కన్పిస్తే లేదా మలంలో పడ్డట్లు కన్పిస్తే.. అలాంటి వారు.. తంతే బూరలో బుట్టలో పోయి పడ్డట్లు వారీ జీవితం మారిపోతుందంట. అలాంటి వారికి గొప్ప అవకాశాలు వెతుక్కుంటు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)