PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద  ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

1 /6

దేశంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఈ క్రమంలో.. బీజేపీ హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా ఈసారి తమకు అధకారం ఇవ్వాలని కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశంలో నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 

2 /6

రాజకీయాల్లో కీలక జీవిత చరిత్రల మీద బయోపిక్ లు తీయడం ట్రెండింగ్ మారింది. మహారాష్ట్ర ముంబైకా షేక్ బాల్ ఠాక్రే జీవితం మీద కూడా బయోపిక్ లు తీశారు. అదే విధంగా అనేక మంది ప్రముఖ నటులు , రాజకీయ నేతల జీవిత చరిత్రల మీద బయోపిక్ లు తీస్తుంటారు.

3 /6

ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్సార్ పై కూడా బయోపిక్ తీశారు. ఈ క్రమంలో ఇప్పుడిక దేశ ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్రను అందరికి తెలిసే విధంగా బయోపిక్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.   

4 /6

మోదీ పాత్రలో.. తమిళ స్టార్ బాహుబలి నటుడు కట్టప్ప సత్యరాజ్ ఈ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి విశ్వనేత అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని భారతీయ భాషల్లో కూడా దీన్ని తెరకెక్కిస్తున్నారు.  

5 /6

ఇప్పటికే మోదీ తన చరిష్మాతో ప్రపంచంలో భారత్ ను ఒక ఉన్నత స్థానంలో ఉంచేందుకు తనవంతుగా గట్టిగా ప్రయత్నాలు చేశారని చెబుతుంటారు. అమెరికా, జపాన్, రష్య తదితర దేశాలు సైతం భారత్ తో స్నేహ బంధానికి తరచుగా ముందుకు వస్తుంటాయి. 

6 /6

ఈ నేపథ్యంలో మోదీ బయోపిక్ కు సంబంధించిన వార్త వెలుగులోకి రావడంతో ఇటు బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పాత్రను పోషించడానికి తనను సెలక్ట్ చేసినందుకు ఎంత సంతోషంగా ఉందంటూ కూడా సత్యరాజ్ అన్నారు.