Famous Food In Hyderabad: హైదరాబాద్ అంటే నిజాం నవాబుల వారసత్వం, రుచికరమైన కబాబ్‌లు, ఘుమఘుమలాడే బిర్యానీలకు పెట్టిందే పేరు. ఇక్కడి వంటకాలు మరి ఎక్కడ దక్కని రుచి.
బిర్యానీ హైదరాబాద్ ఒక రుచికరమైన వంటకం. ఇది సుగంధభరిత బియ్యం, రుచికరమైన మాంసం, అద్భుతమైన మసాలాలతో తయారు చేసే అద్భుతమైన వంటకం. హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్ అనిపించే రుచికరమైన డిష్ .
రంజాన్ నెలలో చాలా ప్రత్యేకంగా చేసే విందు హలీమ్ . గోధుమ, మాంసం, మసాలాలు ఇతర పదార్థాలతో తయారు చేసే వంటకం హలీమ్. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.
రుచికరమైన చాయ్, ఎక్కువ పాలు, బుర్రతో చేస్తారు. హైదరాబాద్ వీధుల్లో, తినుబండారాలు వద్ద ఈ చాయ్ మనకు దొరుకుతుంది. ఈ చాయ్ కోసం ఎగబడి మరి తాగుతారు హైదారబాద్ జనాలు.
మసాలాతో కలిపి చేసిన కీమా, కూరగాయలతో నింపిన వేయించిన పొట్లాలను లుక్మీ అంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. సాయంత్రం చాయ్ తో పాటు తీసుకొనే ఆహారం. చాలా మంది తీసుకుంటారు.
హైదరాబాద్‌లో ప్రతిఒకరికి నచ్చే స్ట్రీట్ ఫుడ్ బోటీ కబాబ్‌లు. మెరినేట్ చేయబడిన మాంసం ముక్కలు, దీని స్కేవర్లపై కాల్చి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.