Team India Diwali 2023 Pics: దీపావళి వేడుకల్లో సాంప్రదాయ దుస్తులతో హల్‌చల్ చేస్తున్న టీమ్ ఇండియా ఆటగాళ్లు

Team India Diwali 2023 Pics: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇవాళ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈలోగా టీమ్ క్రికెటర్ల దీపావళి సందడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, , సిరాజ్, బూమ్రా, షమీ సహా అందరూ సాంప్రదాయ దుస్తుల్లో హల్‌చల్ చేసిన ఫోటోలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. 

1 /5

మొహమ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాలో ప్రమాదకర బౌలర్‌గా మారుతున్నారు. ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. దీపావళి పురస్కరించుకుని బ్లాక్ అండ్ వైట్ కుర్తాతో ఆకర్షిస్తున్నారు.

2 /5

టీమ్ ఇండియా రథ సారధి రోహిత్ శర్మ భార్య రుతికాతో కలిసి వైవిద్యంగా కన్పించారు. దీపావళి సాంప్రదాయ దుస్తులతో హల్‌చల్ చేస్తున్నారు.

3 /5

ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తూ అందర్నీ ఆకర్షించడమే కాకుండా ఇప్పుడు దీపావళి సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకుంటున్నారు.

4 /5

భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ చాలా ప్రత్యేకంగా కన్పించారు. 2023 లో విరాట్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అందరికంటే అత్యధిక పరుగులు సాధించాడు.

5 /5

జస్‌ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ విభిన్నమైన రంగుల్లో సాంప్రదాయ కుర్తాలో క్లిక్ మన్పించారు. ప్రపంచకప్‌లో ఈ ముగ్గురూ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు.