Anti Aging Foods: వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్యం సహజం. కానీ ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే వృద్ధాప్యం మీడపడిపోతోంది. అంటే ఏజీయింగ్ ప్రక్రియ చాలా త్వరగా సంభవిస్తోంది. అయితే ఎక్కువకాలం వృద్ధాప్యం దరిచేరకుండా చేయాలంటే సాధ్యమేనా అంటే ఆరోగ్య నిపుణులు సాధ్యమేనంటున్నారు. దీనికోసం ప్రత్యేకమైన డైట్ తప్పకుండా ఫాలో కావల్సి ఉంటుంది. ఇటీవలి బిజీ ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్స్ , అనారోగ్యకరమైన తిండి కారణంగా చాలా త్వరగా ముడతలు పడిపోతున్న పరిస్థితి తలెత్తుతోంది.
పాలకూర ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో పాలకూర అత్యద్భుతమైందిగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, మెగ్నీషియం, ఐరన్, వంటి న్యూట్రియంట్లు చాలా ఎక్కువ. పాలకూర తినడం వల్ల చర్మం హైడ్రైట్‌గా ఉంటుంది. ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
పప్పులు పప్పులు తినడం వల్ల చాలా లాభాలున్నాయి. పప్పు దినుసులు క్రమం తప్పకుండా తీసుకుంటే ముఖంపై నిగారింపు వస్తుందని చాలామందికి తెలియదు. ఇందులో ప్రోటీన్లు,మినరల్స్, ఫైటో న్యూట్రియంట్లు, విటమినల్స్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
బొప్పాయి బొప్పాయి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్. ఇందులో మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బొప్పాయి తరచూ తినడం వల్ల ముఖంపై ముడతలు, సన్నని గీతలు అన్నీ దూరమౌతాయి. చర్మంపై నిగారింపు వస్తుంది. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
అవకాడో అవకాడోలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, పొటాషియం వంటి న్యూట్రియంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. నిర్జీవమైన చర్మాన్ని సజీవం చేసేందుకు ఉపయోగపడతాయి. అవకాడో క్రమం తప్పకుండా తింటే డెడ్ సెల్స్ నిర్మూలమౌతాయి. యౌవనంగా కన్పిస్తారు.
ముడతల నుంచి విముక్తి ముఖ సౌందర్యం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇవాళే మీ డైట్ ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం యాంటీ ఏజీయింగ్ ఫుడ్స్ తినడం వల్ల ముఖంపై పడే ముడతల నుంచి విముక్తి పొందవచ్చు.