Tecno Phantom V Fold 2 Price: వారేవా.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Tecno నుంచి ఫోల్డ్ 2.. ఫీచర్స్‌ ఇవే!

Tecno Phantom V Fold 2 Price: ప్రముఖ టెక్‌ కంపెనీ Tecno మార్కెట్‌లోకి అద్భుతమైన బుక్‌ స్టైల్‌ ఫోల్డబుల్‌ మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీనిని కంపెనీ Tecno Phantom V Fold 2 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటను కంపెనీ అధికారిక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో  వెల్లడించింది. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది.
 

1 /7

ఈ టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2 (Tecno Phantom V Fold 2) ఫోల్డబుల్ ఫోన్‌ను కంపెనీ మొదట భారత్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు బోలెడు ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.   

2 /7

ఈ ఫోల్డబుల్‌ మొబైల్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఆఫ్రికాలో ప్రకటించింది. అయితే అక్కడ దీని ధర రూ.92,400 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే భారత్‌లో లాంచ్‌ అయితే భారత్‌లో లాంచ్‌  అయినా ఇదే ధరకే లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.  

3 /7

ఇక ఈ మొబైల్‌ వేరియంట్స్‌ వివరాల్లోకి వెళితే కంపెనీ దీనినిపై అధికారికి ప్రకటన ఇంకా చేయలేదు. ఇది మాత్రం మూడు కలర్‌ ఆప్షన్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

4 /7

టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.42-అంగుళాల పూర్తి HD+ AMOLED LTPO ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 2550x1080 పిక్సెల్ రిజల్యూషన్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది.

5 /7

అలాగే ఈ మొబైల్‌ ప్రధాన డిస్ల్పే 2296x2000 పిక్సెల్ రిజల్యూషన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. రెండవ స్క్రీన్‌ మాత్రం 7.85-అంగుళాల 2K+ AMOLED LTPO డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది. 

6 /7

ఇక ఈ ఫోల్డ్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే, ఇది 32-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడా లభిస్తోంది. వీటితో పాటు అదనంగా  2x జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ కెమెరా కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.  

7 /7

ఇక ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన  డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 12GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో రాబోతోంది. ఇది 5750mAh బ్యాటరీ సెటప్‌తో రానుంది.