Tecno Pova 5 Pro Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్స్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇటీవలే విడుదలై Tecno Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఇప్పుడే ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
Tecno Pova 5 Pro Price: ప్రముఖ టెక్ కంపెనీ Tecno ఇటీవలే విడుదల చేసిన Tecno Pova 5 Pro 5G మొబైల్ ఫోన్‌కి మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో లభించడం వల్ల కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మల్టీ-కలర్ బ్యాక్‌లిట్ ఆర్క్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. అయితే తక్కువ బడ్జెట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ Tecno Pova 5 Pro 5G అమెజాన్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదట కంపెనీ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ విడుదల చేసింది. అమెజాన్ ఈ వేరియంట్ మొబైల్‌ను రూ. 15,999లకు విక్రయిస్తోంది.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో Tecno Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. మొదట కంపెనీ ఈ మొబైల్ ఫోన్‌ను రూ. 16,990లకు విడుదల చేసింది. అయితే అమెజాన్ తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూ. 15,999 అందిస్తోంది.
అమెజాన్‌లో Tecno Pova 5 Pro 5G మొబైల్ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అదనంగా డిస్కౌంట్ పొందడానికి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే రూ. 1,250 వరకు తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో ఈ మొబైల్ ఫోన్ రూ. 14,749లకే లభిస్తుంది.
ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరలో పొందడానికి అమెజాన్ ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అదనపు తగ్గింపు పొందాలనుకునేవారు ఎక్చేంజ్ ఆఫర్ వినియోగించి రూ.15,199 వరకు బోసన్ పొందవచ్చు. దీంతో మీకు ఈ మొబైల్ ఫోన్ రూ. 800లకే పొందవచ్చు.
Tecno Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD ప్లస్ డాట్ ఇన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 120 రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. దీంతో పాటు 68W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.