Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..

1 /6

మాధవిలత..(BJP) హైదరాబాద్ పార్లమెంట్ తెలంగాణలోని హైదరాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తోన్న మాధవీలతకు హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు లేదు. ఆమె ఓటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు ఉంది.  ఈమె మల్కాజ్‌గిరితో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి ఓటు వేయనున్నారు.  

2 /6

అసదుద్దీన్ ఓవైసీ (AIMIM) హైదరాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ ఓటు.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ పరిధిలో ఉంది. అసదుద్దీన్ తన ఓటు తాను వేసుకోలేడు.

3 /6

మహ్మద్ సమీర్ (Congress) హైదరాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తోన్న మహ్మద్ సమీర్ ఓటు హక్కు సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంది. ఈయన కూడా తన ఓటు తాను వేసుకోలేడు.

4 /6

కాసాని జ్ఞానేశ్వర్ (BRS) చేవెళ్ల పార్లమెంట్ భారత రాష్ట్ర సమితి తరుపున చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తోన్న కాసాని జ్ఞానేశ్వర్ ఓటు హక్కు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో ఓటు హక్కు ఉంది. ఈయన తన ఓటు తాను వేసుకోలేడు.

5 /6

సునీతా మహేందర్ రెడ్డి (Congress) మల్కాజ్‌గిరి మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సునీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలోని తాండూరులో ఓటు హక్కు ఉంది

6 /6

ఈ రకంగా హైదరాబాద్‌లోని మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోన్న ఐదుగురు అభ్యర్ధులకు తాము పోటీ చేస్తోన్న నియోజకవర్గంలో ఓటు హక్కులేదు. అందులో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీ, ఏఐఎంఐఎం వంటి పార్టీల అభ్యర్ధులకు ఒక రకమైన విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x