Thyroid Diet: థైరాయిడ్‌తో బాధపడేవారు ఈ ఆహారాలు అస్సలు మిస్సవ్వకండి..

Thyroid Patients Diet: ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా సరైన లైఫ్‌స్టైల్ పాటిస్తూ హెల్తీ ఆహారాలు తీసుకోంటే ఏ అనారోగ్య సమస్యలు రావు. 

Thyroid Patients Diet: ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా సరైన లైఫ్‌స్టైల్ పాటిస్తూ హెల్తీ ఆహారాలు తీసుకోంటే ఏ అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా థైరాయిడ్‌తో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
 

1 /7

పాలకూర.. ఆకుకూరల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్‌తో బాధపడేవారు పాలకూరను తమ డైట్లో చేర్చుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీరి డైట్లో ఆకుకూరలు చేర్చుకోవడం ముఖ్యం.

2 /7

పసుపు.. థైరాయిడ్‌తో బాధపడేవారు పచ్చి పసుపును తమ డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో కర్కుమిన్ ఉంటుంది  యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాల కారణంగా వాపును తగ్గిస్తుంది.

3 /7

చేప.. మనందరికీ తెలిసిందే చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారికి ఇవి మంచివి. ముఖ్యంగా మాకేరాల్, సాల్మన్ , ట్యూనా, సార్డినెస్ చేపలు మీ డైట్లో చేర్చుకోండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

4 /7

నట్స్.. నట్స్ మనం సాయంత్రం సమయంలో స్నాక్ తీసుకోవాలి. లేదా రాత్రి నానబెట్టిన నట్స్ ఉదయం పరగడుపున తీసుకున్నా ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా వాల్‌నట్స్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిని కాపాడతాయి. ఎందుకంటే ఇవి ప్రోటీన్లకు మూలం. ఇందులో మోనోసాచురేటేడ్ కొవ్వులుంటాయి.

5 /7

ప్రోబయోటిక్స్.. థైరాయిడ్‌తో బాధపడేవారు పెరుగు పదార్థాలను తమ డైట్లో చేర్చుకోవాలి. ఇవి కూడా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నుంచి మిమ్మల్ని కాపాడతాయి.

6 /7

నాన్ వెజ్.. థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు మేక కాళ్లతో తయారు చేసిన సూప్ తాగాలి. దీంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

7 /7

ముఖ్యంగా స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా వీటిని నేరుగా తినవచ్చు లేదా స్మూథీలకు కూడా జోడించవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )