New Year Tirumala Update: నూతన సంవత్సరం మరింత పెరిగిన భక్తుల రద్దీ. ఎంతసేపు పడుతుందంటే!

New Year devotees: తిరుమలకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. దీంతో ఎంతోమంది భక్తులు కంపార్ట్మెంట్స్ లో గంతలు తరబడి వేచి చూస్తున్నారు. ఇక తిరుమల సమాచారం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.  

1 /5

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి..సమాచారం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ప్రపంచవ్యాప్తంగా తరలివస్తారు. అలాంటిది కొత్త సంవత్సరం అంటే.. ప్రజలు మరింతగా ఆ దేవుడి దర్శనం కోసం ఎదురుచూస్తారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  

2 /5

ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇక తాజాగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని..రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 2025 సంవత్సరం ప్రారంభం కావడంతో.. మొదటిరోజు భక్తులు తిరుమలకి హోరెత్తారు.  

3 /5

ఇక శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలియజేసింది. 300 రూపాయల వారికి.. ఏకంగా ఆరు గంటల పైన సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి.. ఎనిమిది గంటల పైగా సమయం పడుతుంది.    

4 /5

ముఖ్యంగా నిన్న డిసెంబర్ 31న.. సుమారుగా 62,495 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే 19,298 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు.    

5 /5

నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లుగా టీటీడీ తెలియజేసింది.ప్రస్తుతం ఈ సమాచారం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. తిరుమలకు వెళ్లేవారు అన్ని సౌకర్యాలు చూసుకొని వెళ్లాల్సిందిగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు.