టాలీవుడ్‌లో లాక్‌డౌన్ పెళ్లి సందడి చిత్రాలివిగో..

May 27, 2020, 06:04 PM IST

లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తొలుత ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

1/6

టాలీవుడ్‌లో లాక్‌డౌన్ పెళ్లి సందడి చిత్రాలివిగో..

Tollywood Celebrities Wedding During Lock Down

లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తొలుత ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మే 14న తెల్లవారుజామున నిఖిల్ సిద్ధార్థ్- పల్లవి వర్మ, జబర్ధస్త్ కమెడియన్, నటుడు మహేష్- పావనిల వివాహాలు జరిగాయి. లాక్‌డౌన్ కారణంగా హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

రానా దగ్గుబాటి ప్రేమలో విజయం సాధించాడు. ఇటీవల రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక జరిగింది. త్వరలో నిశ్చితార్థం వేడుక జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది చివరకల్లా తన కుమారుడు రానా వివాహం జరిపిస్తామని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇదివరకే ప్రకటించారు. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు, మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడ మనవడు, నటుడు నిఖిల్ కుమారస్వామి వివాహం ఏప్రిల్ నెలలో జరిపించారు. ఈ లాక్‌డౌన్ పెళ్లి ఫొటోలపై ఓ లుక్కేయండి.

2/6

హీరో నిఖిల్ పెళ్లి ఫొటో

Nikhil Siddharth Wedding Photo

లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యాడు. శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య తన ప్రేయసి పల్లవి వర్మను మే 14 తెల్లవారుజామున నిఖిల్ (Nikhil Siddharth) వివాహమాడాడు. హిందూ సంప్రదాయం ప్రకారం, శాస్త్రోక్తంగా ఈ వివాహం జరిగింది. 

3/6

నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటో

Dil Raju Wedding Photo

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా తన సొంతూరు నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో దిల్ రాజు (Dil Raju) వివాహం నిరాడంబరంగా జరిగింది. Dil Raju Marriage Photos సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4/6

‘జబర్దస్త్’ కమెడియన్ మహేష్ పెళ్లి ఫొటో

Jabardath Comedian Mahesh Wedding Photo

మొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం చేసుకోగా, తాజాగా హీరో నిఖిల్ వాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మరో పెళ్లి వార్త. ‘జబర్దస్త్’ కమెడియన్ మహేష్ ఓ ఇంటి వాడయ్యాడు. మే 14 తెల్లవారుజామున మహేష్ వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో పావని అనే యువతిని పెళ్లాడాడు మహేష్. పావని మెడలో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు మహేష్

5/6

నిఖిల్ కుమారస్వామి పెళ్లి ఫొటో

Nikhil Gowda Wedding Photo

ఓవైపు దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి వివాహ వేడుకను (Nikhil Kumaraswamy Wedding Photo) జరిపించారు. బెంగళూరు శివార్లలోని రామనగర్‌లో రేవతి, నిఖిల్‌ల వివాహ వేడుక జరిగింది. 

6/6

రానా, మిహికా రోకా వేడుక..

Rana Daggubati Roka Ceremony Photo

రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం  తెలిసిందే. ప్రేమలో విజయం సాధించానని వెల్లడించి భళ్లాలదేవుడు Rana Daggubati ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ క్రమంలో ప్రేయసి మిహికా బజాజ్‌తో తన నిశ్చితార్థం జరిగిందని వెల్లడించాడని అంతా భావించారు. కానీ వాస్తవానికి జరిగింది రోకా వేడుక. రాానా, మిహికా రోకా వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  (ALL Photos Credit: ఈ ఫొటోలను సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాల నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం)