Nagam Love Story: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్ హోదా కొనసాగిస్తున్న సమయంలో ఏకంగా ముగ్గురితో ఎఫైర్ పెట్టుకుంది . అంతేకాదు మరి ఎంతో మందితో రూమర్స్ కూడా వినిపించాయి. ఇండస్ట్రీలో స్టార్ డం కొనసాగిస్తున్న ఈమెపై ఇలాంటి రూమర్ రావడం నిజంగా అందరిలో ఆశ్చర్యానికి గురిచేసాయి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ను కొనసాగిన ఒక ముద్దుగుమ్మ ఇద్దరు స్టార్ హీరోలతో, ఒక క్రికెటర్ తో ఎఫైర్ నడిపినట్లు సమాచారం. ముగ్గురితో ఎఫైర్ నడిపిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎవరో కాదు అందాల తార సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మా. తెలుగులోనే కాకుండా భోజపురిలో కూడా స్టార్ హీరోయిన్గా చలామణి అయింది. ఇప్పటికీ కూడా అక్కడ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా , 1990 కాలంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ముఖ్యంగా సినిమాలతోనే కాకుండా లవ్ ఎఫైర్స్ తో కూడా వార్తల్లో నిలిచింది. ఇక తెలుగు, తమిళ్ , హిందీ చిత్రాలలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె అమితాబ్ బచ్చన్, చిరంజీవి వంటి సూపర్ స్టార్లతో కూడా పనిచేసింది.
నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. బాలీవుడ్ మూవీ బాఘీ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ తో కలిసి సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా హిందీ చిత్ర సినిమాలో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన ఏడవ చిత్రంగా రికార్డు సృష్టించింది. దాంతో మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ ను అందుకుంది.
ఇకపోతే నగ్మా భారత స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమ వ్యవహారం నడిపిందని అప్పట్లో వార్తలు జోరుగా వినిపించాయి. అయితే సౌరవ్ కు వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత 1999 ప్రపంచ కప్ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. దీంతో సౌరవ్ నగ్మా రిలేషన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సౌరవ్ భార్యకు నగ్మాతో ఎఫైర్ విషయం తెలియడంతో దూరమయ్యారని సమాచారం.
ఆ తర్వాత తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ తో కూడా ప్రేమలో పడిందట. అతడికి కూడా అప్పుడే వివాహం జరిగింది. ఇక వీరి వ్యవహారం అప్పట్లో వైరల్ అవ్వడంతో శరత్ కుమార్ భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసిందని, పరిస్థితి దిగజారకముందే నగ్మా నుంచి శరత్ విడిపోయారని సమాచారం. అలాగే భోజ్పురి నటుడు , పొలిటిషన్ రవి కిషన్ తో కూడా నగ్మా లవ్ ఎఫైర్ నడిపిందని సమాచారం. అప్పట్లో ఈ విషయం మరింత వైరల్ గా మారింది. దాంతో రవి కిషన్ కి కూడా బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఈమె వయసు 49 సంవత్సరాలు. ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా కెరియర్ సాగిస్తోంది.