Ashada Amavasya 2024: రేపు అరుదైన ఆషాఢ అమావాస్య .. ఇలా పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం..!

Ashada Amavasya 2024: రేపు అరుదైనా ఆషాఢ అమావాస్య, ఆదివారం అయితే, ఇది కొన్ని ఏళ్ల తర్వాత ఈ అరుదైన రోజు వచ్చింది. ఈ సమయంలో లక్ష్మి దేవి పూజ చేస్తే అఖండ రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 
 

1 /5

ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజు లక్ష్మిదేవి పూజ చేయాలి. అయితే, ఈరోజు ప్రత్యేకంగా దీపపు కుందులకు పూజ చేస్తే ఏడాది మొత్తం లక్ష్మి కటాక్షం కలుగుతుంది.  

2 /5

 ఆషాఢ అమావాస్య రోజు ఇలా పూజిస్తే ఏడాదిపాటు అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఈ రోజు దీపస్తంభ పూజ. అంటే దీపపు కుందులకు పూజ చేయడం. ఇంట్లో వెండి ప్రమిద ఉంటే మూడు వత్తిలు వేసి వెలిగించాలి. ఆవు నెయ్యి వాడాలి.   

3 /5

వెండి లేకపోతే ఇత్తడి కుందులకు కూడా పూజించండి. ఆ తర్వాత ఓం దీప లక్ష్మి నమో నమః ఆ దీపాలకు కర్పూరాన్ని కూడా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఏడాదిపాటు లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఇంటి ఎనిమిది మూలల్లో దీపాలు వెలిగిస్తే అష్టలక్ష్ముల సంపూర్ణ ఆశీర్వాదాలు కలుగుతాయి.  

4 /5

 లేకపోతే ఒక ప్రమిదతో అన్ని గదుల్లో దీపాన్ని చూపించండి. ఆషాఢ అమావాస్య రోజు గ్రామదేవతలను దర్శించుకుంటే చాలా మంచిది. పెరుగున్నం పెట్టండి, ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు. వ్యాపారంలో బాగా లాభాలు పొందాలంటే ఆషాఢ అమావాస్యరోజు గ్రామ దేవతలకు కుంకుమ సమర్పించండి.   

5 /5

నిమ్మకాయలు దండ సమర్పించండి. నిమ్మకాయ దీపాలు వెలిగించండి. శత్రు బాధలు తొలగిపోతాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)