Dying Prohibited Cities: చావడం కూడా నిషేధం.. ప్రశాంతంగా చచ్చిపోనివ్వనీ ఆ నగరాలు ఏమిటో తెలుసా?

These 5 Cities Dying Is Ban And Its Illegal: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చచ్చిపోవాలన్నా కష్టం. అక్కడ చనిపోవడం కూడా నేరం. చచ్చే హక్కు అక్కడి ప్రజలకు లేదు. మరణంపై నిషేధం విధించిన కొన్ని నగరాలు ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని నగరాలు మృతిపై నిషేధం విధించాయి. అవేంటో.. ఎందుకో తెలుసుకోండి.

1 /6

Dying Ban City: మరణంపై నిషేధం విధించిన కొన్ని నగరాలు ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని నగరాలు మృతిపై నిషేధం విధించాయి. అవేంటో.. ఎందుకో తెలుసుకోండి.

2 /6

సెల్లియా (ఇటలీ) Dying Ban City: ఇటలీలోని మధ్యయుగపు కొండప్రాంత పట్టణం సెల్లియా. ఈ నగర పరిధిలో నివాసితులు అనారోగ్యానికి గురికాకుండా నిషేధం విధించారు. పట్టణంలో రోజురోజుకు జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో అనారోగ్యంతో మృతి చెందడం నిషేధం విధించారు. వ్యక్తులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే వారికి జరిమానాగా అధిక పన్నులు విధిస్తారు. ఈ రకంగా మరణిస్తే పెద్ద శిక్ష వేసే అవకాశం ఉంది.

3 /6

లాంగ్‌ఇయర్‌బైన్ (నార్వే) Dying Ban City: నార్వేలోని స్వాల్‌బార్డ్ ద్వీపంలోని ప్రధాన నగరం లాంగ్‌ఇయర్‌బైన్‌. ఈ నగరంలో 'నో డెత్ పాలసీ' (చనిపోవడం నిషేధం విధానం) ఉంది. ఇది కొండప్రాంతాలు.. మంచుతో నిండి ఉంటుంది. ఇక్కడ ఖననం చేసిన శరీరాలు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండడంతో కుళ్లిపోవు. ఫలితంగా నగరంలో 1950 నుంచి సమాధి చేయడంపై నిషేధించారు.

4 /6

లే లావాండౌ (ఫ్రాన్స్) Dying Ban City: పర్యావరణ ఆందోళనల కారణంగా ఫ్రాన్స్‌లోని లే లావాండౌ పట్టణంలో కొత్త స్మశానవాటికకు అధికారులు అనుమతించలేదు. ఈ కారణంలో 2000 సంవత్సరంలో అక్కడి మేయర్‌ మరణాలపై నిషేధం విధించారు.

5 /6

ఇత్సుకుషిమా (జపాన్)  Dying Ban City: షింటో మతం ప్రకారం జపాన్‌లోని ఇట్సుకుషిమా ద్వీపం పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది. 1868 వరకు ఇక్కడ చనిపోవడం లేదా ప్రసవించడంపై నిషేధం అమల్లో ఉంది. నేటి రోజు వరకు ద్వీపంలో శ్మశానవాటికలు, ఆసుపత్రులు లేకపోవడం విశేషం.

6 /6

కుగ్నాక్స్ (ఫ్రాన్స్) Dying Ban City: ఫ్రెంచ్ నగరమైన కుగ్నాక్స్‌లో చనిపోవడం ఒక నేరం. ఇక్కడ కొత్త శ్మశాన వాటికను తెరవడానికి అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అక్కడ చనిపోవడంపై నిషేధం విధించారు. అయితే ఆ తదనంతరం అధికారులు కొత్త స్మశానవాటికకు అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ చనిపోవడంపై నిషేధం ఎత్తేశారు. కాకపోతే మొన్నటి వరకు అక్కడ చనిపోవడం నిషేధం.