Pitru Paksham 2024: రేపే పితృపక్షం ప్రారంభం.. మగవారు పొరపాటున ఈ 5 పనులు చేయకూడదు..

Pitru Paksham Must Not Do: పితృపక్షం అంటే పితరులకు ప్రత్యేకం. ఈ సమయంలో చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం, తర్పణం చేస్తారు. ప్రతి ఏడాది ఓ 15 రోజులపాటు వారికి అంకితం చేశారు. ఈ ఏడాది పితృపక్షం రేపు 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రత్యేకించి మగవారు ఓ 5 పనులు పొరపాటను కూడా చేయకూడదు.
 

1 /7

పితృపక్షం దినాల్లో చనిపోయిన పెద్దవారు ఈ భూమిపై సంచరిస్తారు అని నమ్ముతారు. తమ కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తారు. అందుకే వారికి శ్రాద్ధకర్మలు నిర్వహించాలని పండితులు చెబుతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీ పితృపక్షం దినాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్‌ 2వ తేదీ మహాలయ అమావాస్యతో ముగియనుంది.  

2 /7

సాధారణంగా పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వంశాభివృద్ధి, జీవితంలో ఇతర ఆటంకాలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయని నమ్ముతారు. అందుకే వారిని శాంతింపజేయడానికి పితృపక్షం దినాలు. ఈ సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, కాకులు పిండ ప్రదానం, బ్రాహ్మణులకు భోజనాలు, వస్త్రదానం వంటివి చేస్తారు.  

3 /7

అయితే, ప్రతి ఏడాది భాద్రపద శుక్లపక్ష పౌర్ణమిరోజు ప్రారంభమై, ఆశ్వీయుజ మాసం కృష్ణపక్షం అమావాస్యతో ముగుస్తుంది. ఈ సందర్భంగా పితృపక్షం దినాలలో ముఖ్యంగా మగవారు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.  

4 /7

పితృపక్షంలో పొరపాటున కూడా ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. ఈ సమయంలో ఏ దానధర్మాలు చేసినా పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ సమయంలో ఉదయం లేచి స్నానదానాలు నిర్వహిస్తారు. మహిళలు రుతుక్రమంలో ఉన్నప్పుడు పితృపక్షంలో పితరుల కోసం ఆహారాలు చేయకూడదు. మగవారు ఆ పనులు చేయవచ్చు.  

5 /7

మద్యం మంసానికి దూరంగా ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇక పితృపక్షం అంటే పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి కొత్త పనులు ప్రారంభించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. కారు ఇల్లు వంటివి కొనుగోలు చేయరు.  

6 /7

ముఖ్యంగా మగవారు హెయిర్‌ కట్‌, గోళ్లు కత్తిరించడం, షేవింగ్ వంటివి చేసుకోకూడదు. కొత్త దుస్తులు కూడా కొనుగోలు చేయరు. కానీ, దుస్తులను పేదవారికి దానంగా ఇవ్వవచ్చు.  

7 /7

పితృపక్షం సమయంలో ప్రతిరోజూ భోజనంలో మొదటి ముద్ద పితరుల కోసం తీసి పక్కనబెట్టాలి. దాన్ని గోవుకు పెట్టాలి. కాకులకు కూడా ఈ పక్షంలో ఆహారం పెడతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)