Top 5 Camera Smarphones: వెడ్డింగ్ ఫోటోగ్రఫీకు సైతం పనిచేసే టాప్ 5 కెమేరా స్మార్ట్‌ఫోన్లు ఇవే, ధర, ఇతర ఫీచర్లు

Top 5 Camera Smarphones: ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి వెడ్డింగ్ ఫోటోలు తీసేందుకు సహజంగానే బెస్ట్ కెమేరా ఉండాలి. అయితే స్మార్ట్‌ఫోన్లలోనే అంతటి బెస్ట్ కెమేరా ఆప్షన్లు వచ్చేశాయి. మల్టిపుల్ లెన్స్ , హై మెగాపిక్సెల్, అడ్వాన్స్డ్ ఇమేజ్ ప్రోసెసింగ్ ఫీచర్లతో కొన్ని ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Top 5 Camera Smarphones: వెడ్డింగ్ ఫోటోలు తీయాలనుకుంటున్నారా..ఫోటోగ్రపీ ఆసక్తిగా ఉందా..మీ కోసమో ఇక్కడ టాప్ 5 కెమేరా స్మార్ట్‌ఫోన్ల గురించి పూర్తి వివరాలు అందిస్తున్నాం. ఇందులో కెమేరా ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ టాప్ 5 కెమేరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..
 

1 /5

Xiaomi 13 Pro Xiaomi 13 Pro లో మూడు కెమేరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా. తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో లభిస్తోంది. దీని ధర 79,999 రూపాయలు.

2 /5

Vivo X90 Pro Vivo X90 Pro లో ZEISS సహకారంతో అద్భుతమైన కెమేరా ఉంది. ప్రైమరీ కెమేరా తక్కువ లైట్‌లో కూడా ఫోటోలు క్లిక్ చేస్తుంది. ఈ ఫోన్ కూల్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ధర 84,999 రూపాయలు.

3 /5

Vivo V27 Pro Vivo V27 Pro ఈ ఫోన్ సూపర్ స్లిమ్ అండ్ బెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రైమరీ కెమేరా చాలా శక్తివంతమైంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర 37,999 రూపాయలు.

4 /5

Samsung Galaxy S23 Ultra Samsung Galaxy S23 Ultra ఇప్పటి వరకూ అద్భుతమైన కెమేరా కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ 2 చిప్ ద్వారా అనుసంధానితమైంది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం ప్రత్యేకత. ఇందులో ఎస్ పెన్ కూడా ఉంది. ఇది రైటింగ్, డ్రాయింగ్‌కు పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 1,24,999 రూపాయలు.

5 /5

OPPO Reno 10 Pro Plus OPPO Reno 10 Pro Plus లో హై ఎండ్ కెమేరా ఉంది. ఎక్కువ జూమ్ చేసినా సరే ఫోటో క్వాలిటీ దెబ్బతినదు. ఈ ఫోనా్  ప్రారంభధర 39,999 రూపాయలు.