Top Bikes Under 2 Lakhs: 2 లక్షల్లోపు ధరలో లబించే టాప్ 5 బైక్స్, , వాటి ఫీచర్లు ఇలా

గత కొద్దికాలంగా మార్కెట్‌లో విభిన్న రకాల టూ వీలర్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. అందులో మస్క్యులర్ స్టైల్ బైక్స్‌కు క్రేజ్ ఎక్కువగా కన్పిస్తోంది. 2 లక్షల రూపాయల్లోపు బడ్జెట్‌లో లభించే టాప్ 5 బైక్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్, యమహా, బజాజ్ కంపెనీల బైక్స్ ఉన్నాయి. 

Top Bikes Under 2 Lakhs: గత కొద్దికాలంగా మార్కెట్‌లో విభిన్న రకాల టూ వీలర్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. అందులో మస్క్యులర్ స్టైల్ బైక్స్‌కు క్రేజ్ ఎక్కువగా కన్పిస్తోంది. 2 లక్షల రూపాయల్లోపు బడ్జెట్‌లో లభించే టాప్ 5 బైక్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్, యమహా, బజాజ్ కంపెనీల బైక్స్ ఉన్నాయి. 

1 /5

Yamaha R 15S యమహా ఆర్ 15 ఎస్ ప్రారంభ ధర1.65 లక్షలు. ఇండియాలో 1 వేరియంట్ 2 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కూడా రెండువైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 

2 /5

TVS Ronin ఇది స్టైలిష్ అండ్ మస్క్యులర్‌లా ఉంటుంది. మోడర్న్ క్రూయిజర్ లుక్ కలిగి ఉంటుంది. ఇందులో 4 వేరియంట్లు 7 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 225.9 సీసీ, బీఎస్ 6 ఇంజన్ ఉంటుంది ఇది 20.1 బీహెచ్‌పి పవర్, 19.33 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్దుంది. డ్యూయల్ ఛానెల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర 1.49 లక్షల రూపాయలు

3 /5

Bajaj NS 200 బజాజ్ ఎన్ఎస్ 200 స్టైలిష్ నేక్డ్ డిజైన్‌తో వస్తోంది. పల్సార్ ఎన్ఎస్ 200 లో 1999.5 సిసి, బీఎస్ 6 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 24.13 బీహెచ్‌పి , 18.74 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్ ఉంటాయి. దాంతో పాటు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ బైక్ బరువు 159.5 కిలోలు. ఈ బైక్ దర 1.42 లక్షల రూపాయలు

4 /5

Royal Enfield Hunter 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అనేది రోడ్‌స్టర్ బైక్ . ఇదులో 3 వేరియంట్లు, 10 రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. హంటర్ 350 బీఎస్ 6 ఇంజన్‌తో వస్తోంది. 20.2 బీహెచ్‌పి పవర్, 27 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ అం్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉండటం ప్రత్యేకత. ఇందులో సింగిల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంది. ఈ బైక్ ధర 1.49 లక్షలు. 

5 /5

TVS Apache RTR 200 4 V టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధర 1.42 లక్షలు. ఇందులో 2 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 200 సిసి సింగిల్ సిలెండర్ బీఎస్ 6 ఇంజన్ ఉంటుంది. స్పోర్ట్ బైక్‌లా కన్పిస్తుంది. ఈ బైక్ ఇంజన్ 20.54 బీహెచ్‌పి పవర్, 17.25 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా రెండు వైపులు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x