Protein Foods: నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్లు లభించే 5 బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే

మనిషి శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. శరీరంలో మజిల్స్ నిర్మాణంలో తప్పకుండా అవసరమౌతాయి. అంతేకాదు శరీరానికి కావల్సిన శక్తిని అందించడం, రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో దోహదం చేస్తుంది. ప్రోటీన్లు అంటే సాధారణంగా గుడ్లు, మాంసాహార భోజనమే అనుకుంటారంతా. కానీ 5 రకాల శాకాహార పదార్ధాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Protein Foods: మనిషి శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. శరీరంలో మజిల్స్ నిర్మాణంలో తప్పకుండా అవసరమౌతాయి. అంతేకాదు శరీరానికి కావల్సిన శక్తిని అందించడం, రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో దోహదం చేస్తుంది. ప్రోటీన్లు అంటే సాధారణంగా గుడ్లు, మాంసాహార భోజనమే అనుకుంటారంతా. కానీ 5 రకాల శాకాహార పదార్ధాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1 /5

మష్రూం మష్రూం ప్రోటీన్లు పుష్కలంగా లభించే మంచి శాకాహారం. గుడ్లతో పోలిస్తే ఇందులోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 

2 /5

డ్రై ఫ్రూట్స్, అండ్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ , సీడ్స్‌లో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, ఫ్లక్స్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వంటివి చెప్పుకోదగ్గవి. 

3 /5

క్వినోవా  క్వినోవాను సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో కూడా ప్రోటీన్లు ఎక్కువ. ప్రతి 100 గ్రాముల క్వినోవాలో 14 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి  అవసరమైన అమైనో యాసిడ్స్ లభిస్తాయి. 

4 /5

పప్పుులు పప్పుల్లో ప్రోటీన్లతో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. మసూర్ దాల్, శెనగ పప్పు వంటి పప్పుల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా లభిస్తాయి. 100 గ్రాముల మసూర్ దాల్‌లో 25 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. 

5 /5

సోయాబీన్ సోయాబీన్ అంటేనే ప్రోటీన్లకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. 100 గ్రాముల సోయాబీన్‌లో 36 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అదే ఒక్కొక్క గుడ్డులో కేవలం 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్‌ను చాలా రకాలుగా తీసుకోవచ్చు.