రైల్వే ప్రయాణికులకు ధరల రూపంలో మరోసారి షాక్ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది. దేశంలోని పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల నుండి బయల్దేరే రైళ్ల టికెట్ బుకింగ్ ధరలు పెరగనున్నాయి.
ఇండియన్ రైల్వే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించినట్టయితే.. ఈ నెల నుండే రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులపై అభివృద్ధి రుసుము ( User development fee ) విధించే అవకాశాలు ఉన్నాయి.
యూజర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మొదటి దశలో న్యూఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్, ఇండోర్, చండీఘడ్‌తో పాటు సుమారు 100 రైల్వే స్టేషన్లలో రైలు ఛార్జీలపై యుడిఎఫ్ అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వే అధికారవర్గాలు తెలిపాయి.
స్లీపర్ క్లాస్ ట్రెయిన్ టికెట్స్ ధరలతో పోల్చుకుంటే.. ఏసీ క్లాస్ టికెట్స్ ధరలు ఎక్కువగా పెరగనున్నాయి.