UPI New Rules 2024: Gpay, Phonepe వాడేవారికి బిగ్ అప్డేట్.. ఈరోజు నుంచే UPI అదిరిపోయే 5 కొత్త రూల్స్..

UPI New Rules 2024: యూపీఐ వినియోగ ద్వారాలకు ఇది బిగ్ అప్డేట్.. ప్రతిరోజు గూగుల్ పే, ఫోన్ పే వాడేవారు వచ్చే నవంబర్ నుంచి అనేక కొత్త మార్పులను చూస్తారు. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కూడా తెలుస్తోంది. అయితే యూపీఐ లో వచ్చే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..


UPI New Rules 2024: గూగుల్ పే, ఫోన్ పే, ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. లావాదేవీల భద్రత కోసం.. అలాగే సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆర్బిఐ ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మార్పులు వచ్చే నవంబర్ నెలలో నుంచి అమలులోకి రాబోతున్నట్లు RBI తెలిపింది. దీంతో Gpay, Phonepe, పేటీఎం, ఇతర యూపీఐ లావాదేవీలు చేసే వారికి నవంబర్ నుంచి మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

1 /7

యూపీఐ సంబంధించిన లావాదేవీలు సులభంగా, సురక్షితంగా.. అనుకూలంగా ఉండడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఆర్బిఐ ఐదు కొత్త రూల్స్ ని తెలిపింది. అయితే ఆ రూల్స్ కు సంబంధించిన వివరాలేంటో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. 

2 /7

ప్రధాన మార్పుల్లో భాగంగా.. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు సంబంధించిన కొన్ని అత్యవసర రంగాల రోజు వారి లావాదేవీలకు సంబంధించిన పరిమితులను పెంచబోతున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.  

3 /7

 గతంలో వీటికి సంబంధించిన లావాదేవీలు పరిమితంగా ఉండేవి.. కానీ ఈ రూల్స్ లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 లక్షలకు పైగా పెంచినట్లు తెలిపింది. దీని ద్వారా ఆసుపత్రి బిల్లులు లేదా ట్యూషన్ కు సంబంధించిన ఫీజులు కూడా ఒక్కరోజులోనే ఎక్కువ మోతాదులో పేమెంట్ చేయవచ్చు..  

4 /7

ఇక రెండో మార్పులో భాగంగా యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే ఈ ఫీచర్ ద్వారా డైరెక్ట్ యూపీఐ కి క్రెడిట్ లైన్ ను యాక్సెస్ చేసి వ్యాపారాలు చేసేవారు ఎలాంటి పేమెంట్లైనా అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకుండా అనుకున్నంత డబ్బు చెల్లించవచ్చు. ఈ ఫీచర్ చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారికి చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది.   

5 /7

అలాగే ఈ ప్రత్యేకమైన రూల్స్ లో భాగంగా యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఇంతకుముందు కొన్ని ఇంటర్నెట్ బ్యాంకులకు సంబంధించిన ఖాతాల నుంచి డైరెక్ట్ ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేసేవారు.. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా విత్ డ్రా చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన పర్మిషన్ అందించింది. దీని ద్వారా ఎలాంటి ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ ద్వారానే నెట్ కాష్ తీసుకోవచ్చు.   

6 /7

అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూల్స్ లో భాగంగా కూలింగ్ ఆఫ్ పీరియడ్ నుండి కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారుడు యూపీఏ ద్వారా ఇతరులకు డబ్బులు పంపించినప్పుడు ఈ ప్రత్యేకమైన ఫీచర్ ద్వారా ఎలాంటి జరిమానా లేకుండా రూ.2,000 వరకు తిరిగి పొందవచ్చు. ముఖ్యంగా ఈ ఫీచర్ కొత్తగా యూపీఐ వాడేవారికి ఎంతగానో సహాయపడుతుంది.   

7 /7

యూపీఐ వినియోగదారులు ఎప్పటికప్పుడు ఈ ప్రత్యేకమైన నిబంధనలను తెలుసుకోవడం వల్ల సురక్షితమైన లావాదేవీలను చేయవచ్చు. భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా ప్రత్యేకమైన అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త నిబంధనలను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది.