Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ తిరుమల అంతా ఖాళీ..

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 గురు మృత్యువాత పడటం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే.. నిన్న జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలలో కంపార్ట్ మెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

1 /5

Vaikuntha Ekadashi 2025: ప్రపంచ వ్యాప్తంగా సనాతన హిందు భక్తులు  వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే కోరిక బలీయంగా ఉంటుంది.  ఆ రోజున దర్శనం చేసుకుంటే మంచిదనే వాదనలున్నాయి. తిరుమలలో దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు నిన్న జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గింది.  

2 /5

ఉచిత దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండటం లేదు. నేరుగా దర్శనానికి వెళ్లిపోతున్నారు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు దర్శనానికి  8 నుంచి 10  గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.  

3 /5

ఇక రూ. 300 శీఘ్ర దర్శనంకు  2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అటు కాలి నడకన అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల మధ్య సమయం పడుతోందన్నారు.  

4 /5

అటు సర్వ దర్శనమ్ టోకెన్ కలిగిన  భక్తులకు 4 నుండి 5 గంటల సమయం పడుతుందన్నారు. నిన్న స్వామి వారిని దాదాపు 62,903 దర్శించుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

5 /5

తిరుమలలో నిన్న 17 వేలకు పైగా భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 2.51 కోట్లు వచ్చిందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే కొండపై అనుమతిస్తామన్నారు.