FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక పీరియడ్ వరకు డబ్బును డిపాజిట్ చేస్తే ఎక్కువ శాతం వడ్డీ పొందుతూ నెలనెలా ఆదాయం పొందే మార్గం. ఇది పెట్టుబడిదారులకు గ్యారెంటీ రిటర్న్స్ అందిస్తాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఈ ఫిక్స్ డిపాజిట్స్ పై వడ్డీలు ఇస్తాయి. మీరు డిపాజిట్ చేసిన సమయం, డబ్బు ఆధారంగా మెచ్యూరిటీ సమయం వరకు నెల నెల వడ్డీని జమ చేస్తాయి.
FD Interest Rates: ఇందులో 5 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే అదనంగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు FDపై ఎక్కువ మొత్తంలో ఖాతాదారులకు వడ్డీని అందిస్తున్నాయి. అయితే ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ లభిస్తుందో ఎందులో మనం ఫిక్స్ డిపాజిట్ చేయడం మేలో తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంకు ఎక్కువగా వడ్డీ రేట్లు ఖాతాదారులకు అందిస్తోంది. ఇది 7.20% సంవత్సరానికి అందజేస్తుంది 18 నెలల వరకు ఫిక్స్ డిపాజిట్ చేసుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఏడాదికి మీ డబ్బు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.70 శాతం, రెండు సంవత్సరాలకు 7.10 శాతం, ఐదు సంవత్సరాలకు 7 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అతిపెద్ద బ్యాంకు ఇది ఎక్కువ శాతం వడ్డీని అందిస్తుంది. 7.25% వరకు 18 నెలల నుంచి 21 నెలల లోపు వడ్డీ ఫిక్స్ డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఇది వర్తిస్తుంది. ఏడాదికి 6.60% మూడేళ్లకు ఐదేళ్లకు 7శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుంది.
ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీని అందజేస్తుంది. 15 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు 7.20% వడ్డీని ఇస్తుంది. ఇక ఏడాదికి గాను 6.75 శాతం, మూడేళ్లు, ఐదేళ్లగాను 7 శాతం వడ్డీని ఖాతాదారులకు ఫిక్స్ డిపాజిట్ పై అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా లో కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీని అందిస్తుంది. రెండు, మూడేళ్లకు 7.25% అందజేయగా ఏడాది ఫిక్స్ డిపాజిట్ చేసిన ఖాతాదారులకు 6.85 శాతం వడ్డీ అందజేస్తుంది. మూడేళ్లు ఐదేళ్లకు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.50, 7.25% వడ్డీని అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 7.25% వడ్డీని అందిస్తుంది. ఇది 400 రోజుల ఫిక్స్ డిపాజిట్ పై వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఏడాదికి ఫిక్స్ డిపాజిట్ చేయాలనుకుంటే 6.75 శాతం వడ్డీ లభిస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంకులో మూడేళ్లకు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.50 శాతం, 5 ఏళ్ల వరకు ఫిక్స్ డిపాజిట్ చేస్తే మీరు మెచ్యూరిటీ పొందే వరకు 7 శాతం వడ్డీ అందిస్తారు.
ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 రోజులకు అమృత్ కలశ్ స్కీమ్ కింద 7.10% వడ్డీని అందిస్తుంది. ఏడాదికి మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.8% వడ్డీ లభిస్తుంది. ఇక మూడేళ్లకు 6.50 శాతం, ఐదేళ్లకు 6.75% వడ్డీ లభిస్తుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీని పొందుతారు. ఇక్కడ 444 రోజుల స్కీం కింద 7.30% వడ్డీని ఏడాదికి అందిస్తుంది. ఈ బ్యాంకులో మీరు సంవత్సరం పాటు డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటే 6.90 వడ్డీని అందిస్తుంది. మూడేళ్లకు ఐదేళ్లకు 6.50% వడ్డీ లభిస్తుంది.