Kidney Health Foods: కిడ్నీ సమస్యలుంటే ఏ ఫుడ్స్ తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

మనం తీనే ఆహారపు అలవాట్లను బట్టి ఆరోగ్యం ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా శరీరంలో అత్యంత కీలక అవయవమైన కిడ్నీలపై ఉంటుంది. కిడ్నీలో రాళ్లు, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటన్నింటికీ డైట్ ఒక్కటే పరిష్కారం...

Kidney Health Foods: మనం తీనే ఆహారపు అలవాట్లను బట్టి ఆరోగ్యం ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా శరీరంలో అత్యంత కీలక అవయవమైన కిడ్నీలపై ఉంటుంది. కిడ్నీలో రాళ్లు, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటన్నింటికీ డైట్ ఒక్కటే పరిష్కారం...
 

1 /5

గుడ్లు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే సాల్మన్ ఫిష్, గుడ్లు తీసుకోవాలి. విటమిన్ డి అధికంగా ఉండే పదార్ధాలు తప్పకుండా తినాలి

2 /5

నిమ్మ నీరు కిడ్నీలో రాళ్లుంటే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కెఫీన్ లిక్విడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. శరీరం ఎప్పుడూ డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నిమ్మ నీరు, పండ్ల రసం తప్పకుండా తీసుకోవాలి.

3 /5

తులసి నీళ్లు తినే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండాలి. పాలకూర, వంకాయ, టొమాటో, డ్రై ఫ్రూట్స్, చాకోలేట్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. రోజూ తులసి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

4 /5

కొబ్బరి నీళ్లు ఆరెంజ్ జ్యూస్, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటి వాటర్ కంటెంట్ పదార్ధాలు డైట్‌లో ఉంటే చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. డైట్‌లో మటర్, క్యారట్, మష్రూమ్స్, కీరా వంటివి తప్పకుండా ఉండాలి. ప్యాకెట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

5 /5

రోజూ తగిన పరిమాణంలో నీరు తాగడం కిడ్నీలో రాళ్లు అనేది చాలా తీవ్రమైన సమస్య. కొన్ని రకాల పదార్ధాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగిపోతుంది. ప్రతిరోజూ కనీసం 10 గ్లాసుల వరకూ నీళ్లు తాగాలి.