EPF Insurance: ఈపీఎఫ్ ఎక్కౌంట్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న అప్‌డేట్స్ తెలుసుకోవడం చాలా ఉపయోగం. ఎందుకంటే ఈపీఎఫ్ ఎక్కౌంట్ ఉన్నవారికి సరికొత్త ప్రయోజనాలు అందే అవకాశాలున్నాయి. ఈపీఎఫ్‌లో ఆ ఒక్క దరఖాస్తు నింపితే..7 లక్షల వరకూ ప్రయోజనం కలుగుతుంది. ఒక్క దరఖాస్తుతో 7 లక్షల వరకూ ప్రయోజనమేంటని ఆశ్చర్యపోతున్నారా..నిజమే. ఆ వివరాలు మీ కోసం.
ఆ తరువాత పేజీలో E Sign ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వన్‌టైమ్ OTP వస్తుంది. ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇదే స్కీమ్‌లో 2 లక్షల నుంచి 6 లక్షల వరకూ భీమా ఉండేది. ఇప్పుడు భీమాను పెంచింది ఈపీఎఫ్. కనీసం 2 లక్షల 50 వేల రూపాయలు..గరిష్టంగా 7 లక్షల రూపాయలు అందనున్నాయి.
కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేసిన తరవాత నామినీగా ఎవర్ని ఎంచుకుంటే వారి వివరాల్ని నమోదు చేయాలి. Add Family Detailsపై క్లిక్ చేసి వివరాలన్నీ సమర్పించాలి. ఒకరు లేదా ఎక్కువ మంది పేర్లు ఇవ్వవచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా చెప్పవచ్చు. చివరిగా వివరాల్ని సరిచూసుకున్న తరువాత Save EPF Nominationపై క్లిక్ చేయాలి.
ముందుగా ఈపీఎఫ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. తరువాత సర్వీస్ పై క్లిక్ చేయాలి ఇందులో ఫర్ ఎంప్లాయిస్ సెక్షన్ క్లిక్ చేస్తే.. Member UAN/Online Service ఆప్షన్ తెర్చుకుంటుంది. మెంబర్ ఈ సేవా పోర్టల్ ఓపెన్ అయిన తరువాత ఉద్యోగులు యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత manage ట్యాబ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో E Nomination సెలెక్ట్ చేయాలి.
ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్‌లో చేరాలంటే సంబంధిత ఉద్యోగులు ఇ నామినేషన్ పైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాల్ని ఈపీఎఫ్ అక్కౌంట్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాల్ని ఎంటర్ చేయవచ్చు. ఇ నామినేషన్ ద్వారా సులభంగా చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులంతా ఇ నామినేషన్ ఫైల్ చేసి కుటుంబసభ్యులకు సామాజిక భద్రత కల్పించాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది.
ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల కుటుంబానికి 7 లక్షల రూపాయల ప్రయోజనం అందుతుంది. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ స్కీమ్. పీఎఫ్ ఎక్కౌంట్ ఉన్న ఉద్యోగులంతా ఈ స్కీమ్‌కు అర్హులే. పీఎఫ్ ఎక్కౌంట్ కొనసాగుతున్న క్రమంలో ఆ ఉద్యోగి మరణిస్తే..కుటుంబసభ్యులకు 7 లక్షల రూపాయల భీమా అందుతుంది.
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే ఏదో నెల నెలా డబ్బులు జమ కావడమే కాదు ఇంకా చాలా ప్రయోజనాలుంటాయి. ఈపీఎఫ్‌లో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందనే విషయం చాలామందికి తెలియదు.
Next Gallery