Pregnancy Symptoms: గర్భం దాల్చిన ఎన్ని రోజుల తర్వాత గర్భధారణ లక్షణాలు కనిపిస్తాయి?

Pregnancy Symptoms: గర్భం దాల్చడం అనేది మహిళల్లో ముఖ్యమైన అంశం. అయితే, గర్భధారణ అనేది కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. కొంతమంది మహిళలు ఈ కాలంలో ఎక్కువగా ఫెర్టిలిటీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు  కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించవచ్చు.
 

1 /5

 మహిళలు గర్భం దాల్చినప్పుడు కనిపించే అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి పీరియడ్స్‌ రాకపోవడం. ఇది ఇప్పటి వరకు అందరూ నమ్ముతారు. అయితే, కొన్నిసార్లు పీరియడ్‌ను కోల్పోవడం వెనుక ఇతర కారణాలు ఉండవచ్చు.   

2 /5

సాధారణంగా హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (HCG) నిర్దిష్ట స్థాయిని గుర్తించి గర్భధారణ పరీక్షలు చేస్తారు. పీరియడ్స్‌ మిస్‌ అయిన వెంటనే కొన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్‌ పరికరాలు దొరుకుతాయి. మీరు మీ పీరియడ్స్ మిస్ అయిన వెంటనే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకోవచ్చు,  

3 /5

వికారం, వాంతులు గర్భందాల్చిన ఎక్కువ శాతం మహిళల్లో కనిపిస్తాయి. అంతేకాదు ఈ సమయంలో తరచుగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది కొంతమంది మహిళలకు బాగా నిద్ర వస్తుంది. ఎక్కువ శాతం మంది మహిళలు అలసిపోయినట్లు అనిపిస్తుంది

4 /5

వెన్నునొప్పి కూడా వస్తుంది. అంతేకాదు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు రొమ్ము నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు గర్భం దాల్చిన 2 వారాల తర్వాత కనిపిస్తాయి. రొమ్ములో మార్పులు కూడా కనిపిస్తాయి.  

5 /5

గర్భం లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా కనిపిస్తాయి. కొంతమంది మహిళలు గర్భం దాల్చిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)