Ban On Celebrations: క్రిస్మస్ , కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన రాష్ట్రాలివే

ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు సామూహిక సమావేశాలు, వేడుకల్ని నిషేధించగా కొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించాయి. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణలో భాగంగా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి. ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏయే ఆంక్షలున్నాయో పరిశీలిద్దాం.

Ban On Celebrations: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు సామూహిక సమావేశాలు, వేడుకల్ని నిషేధించగా కొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించాయి. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణలో భాగంగా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి. ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏయే ఆంక్షలున్నాయో పరిశీలిద్దాం.

1 /10

మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎక్కడా ఐదుమంది కంటే ఎక్కువమంది ఉండకూడదు. రాత్రి 9 గంటల్నించి ఉదయం 6 గంటల వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఇండోర్ పెళ్లిళ్లకు కేవలం 100 మందికే అనుమతి ఉండగా, అవుట్‌డోర్ అయితే 250 వరకూ అనుమతి ఉంది. సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక సమావేశాల్లో  ఒక ప్రాంతంలో 100 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. ఇండోర్‌లో అయితే సామర్ధ్యంలో 25 శాతం మాత్రమే ఉండాలి. 

2 /10

మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తోంది.

3 /10

కర్ణాటక క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చ్ వెలుపల గ్యాదరింగ్ నిషేధించారు. చర్చ్ లోపల మాత్రమే ప్రార్ధనలకు అనుమతి ఉంది. అయితే సామాజిక దూరం విధింగా పాటించాలి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకల్ని, పబ్లిక్ గ్యాదరింగ్స్‌ను నిషేధించారు. డీజే మ్యూజిక్, ప్రత్యేక ఈవెంట్లు అనుమతించరు. సామర్ధ్యానికి 50 శాతం మాత్రమే అనుమతి ఉంటుంది. కొత్త ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకూ అమల్లో ఉంటాయి.

4 /10

హర్యానా హర్యానా కూడా నైట్‌కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. దాంతోపాటు సామూహిక సమావేశాలపై ఆంక్షలు విధించింది. నైట్‌కర్ఫ్యూ రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ ఉంటుంది. ఇండోర్, అవుట్‌డోర్ వేడుకలు లేదా సమావేశాలకు 2 వందల్నించి 3 వందల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నిబంధనలు డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకూ అమల్లో ఉంటాయి.

5 /10

గుజరాత్ ఇక గుజరాత్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని 8 నగరాల్లో నైట్‌కర్ప్యూ విధించింది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉంటుంది. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, జునాగఢ్, జామ్‌నగర్, భావనగర్, గాంధీనగర్‌లలో నైట్‌కర్ఫ్యూ ఉంటుంది. 

6 /10

ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించారు. అన్నిరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధించబడ్డాయి. ఇక రెస్టారెంట్లు , బార్ అండ్ పబ్స్ విషయంలో నిర్ణీత సామర్ధ్యంలో 50 శాతం మాత్రమే అనుమతి ఉంటుంది. పెళ్లిళ్లకకు అయితే గరిష్టంగా 2 వందలమందికి అనుమతి ఉంటుంది. 

7 /10

తమిళనాడు తమిళనాడులో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అన్ని రకాల సామూహిక బహిరంగ సమావేశాల్ని రాష్ట్రంలోని అన్ని బీచ్‌లలో నిషేధించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ఈ నిషేధం ఉంటుంది. కోవిడ్ సంబంధిత ఆంక్షల్ని డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. 

8 /10

రాజస్థాన్ రాజస్థాన్ ప్రభుత్వం రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. జిమ్స్, థియేటర్లు, స్పా, హోటళ్లు 50 శాతం సామర్ధ్యంతో మాత్రమే నడవనున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్లలో అయితే 25 శాతం సామర్ధ్యం మించకూడదు

9 /10

పుదుచ్చేరి పుదుచ్చేరి ప్రభుత్వం జనవరి 2వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. నైట్ కర్ఫ్యూ ప్రతి రోజూ రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ ఉంటుంది. అయితే డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో నైట్‌కర్పూని రాత్రి 2 గంటల వరకూ సడలించారు. కేవల రాత్రి 2 గంటల్నించి ఉదయం 5 గంటల వరకే నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

10 /10

ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి అంటే డిసెంబర్ 25 నుంచి నైట్‌కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుంది. పెళ్లిళ్లలో గరిష్ట పరిమితి 2 వందలుగా చేసింది ప్రభుత్వం. జిల్లా యంత్రాంగం నుంచి ఈ మేరకు అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. నో మాస్క్ నో గూడ్స్ కచ్చితంగా అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.