Sajeeb Wazed Joy: షేక్‌ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ ఎవరు? ఆయన ఏం చేస్తుంటారు తెలుసా?

Sheikh Hasina Son Sajeeb Wazed Joy: బంగ్లాదేశ్‌ అల్లర్ల నేపథ్యంలో నిన్న షేక్‌ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్‌ వదిలి వెళ్లారు. ఈ సందర్భంగా షేక్‌ హసీనా కొడుకు సాజీబ్‌ వాజెద్‌ జాయ్‌ ఎవరు? ఆయన ఏం చేస్తుంటాడు? ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

సాజీబ్‌ వాజెద్‌ జాయ్‌ బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా కొడుకు. అంతేకాదు ఈయన, ఫాదర్‌ ఆఫ్ నేషన్‌, బంగ్‌బంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌కు మనవడు కూడా. సాజీబ్‌ వాజెద్‌ జాయ్‌ 1971 జూలై 27న బంగ్లాదేశ్‌ వార్‌ టైమ్‌లో న్యూక్లీయర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎంఏ వాజెద్‌ మియా, షేక్‌ హసీనాలకు జన్మించారు.  

2 /5

బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో జన్మించిన సందర్భంగా సాజీబ్‌కు జాయ్‌ అనే పేరు కూడా పెట్టా. అంటే బెంగాళీలో విజయం అని అర్థం. వాజీబ్‌ మన దేశంలోని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీ బెంగళూరు యూనివర్శిటీలో చదువుకున్నారు. ఆ తర్వాత అర్లింగటాన్‌లోని టెక్సాస్‌ యూనివర్శిటీలో బీఎస్సీ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు.  

3 /5

అంతేకాదు ఈయన హర్వార్డ్‌ యూనివర్శిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ కూడా పూర్తి చేశారు 2002లో సాజీబ్‌ క్రిస్టీన్‌ వాజెద్‌ను పెళ్లిచేసుకున్నారు.వీరికి సోఫియా రెహానా వాజెద్‌ అనే కూతురు కూడా ఉంది. ఇక సాజీబ్‌ మాజీ ప్రధానికి ఐసీటీ అడ్వైజర్‌గా కీలకపదవిలో పనిచేశారు. అంతేకాదు డిజిటల్‌ బంగ్లాదేశ్‌ విస్తరణకు కూడా కృషి చేశారు  

4 /5

2007లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సాజీబ్‌ను యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఐసీటీ సెక్టార్‌లో ఆయన చేసిన కృషిగాను గుర్తించారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ నిరసనలో 300 మంది వరకు ప్రాణాలు విడిచారు. నిరసనకారులు షేక్‌ హసీనాను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా షేక్‌ హసీనా రాజీనామా చేశారు.  

5 /5

బంగ్లాదేశ్‌ ఆర్థికశక్తిగా పెరగడానికి ఆమె చేసిన కృషికి సాజీబ్‌ సమర్థించారు. ఈ నేపథ్యంలో ఆయన అమాయక ప్రజల రక్షణకు ప్రజలు ఎన్నుకోలేని ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు నిలబడదు. బార్డర్‌ గార్డ్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌, సైన్యాన్ని రాజ్యంగా రక్షణ, ప్రజల భద్రను అర్థం చేసుకోవాలని ఎక్స్‌ వేధికగా తెలిపారు.