CBSE Board exams 2021 schedule news | వచ్చే ఏడాది సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ఎప్పటి షెడ్యూల్ కంటే ముందుగానే జరగొచ్చా అంటే అవుననే తెలుస్తోంది. నీట్, జేఈఈ ( NEET, JEE ) లాంటి పోటీ పరీక్షల్ని సకాలంలో నిర్వహించుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ని వీలైనంత త్వరగా నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై సీబీఎస్ఈ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
CBSE Board exams 2021 schedule news | వచ్చే ఏడాది సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ఎప్పటి షెడ్యూల్ కంటే ముందుగానే జరగొచ్చా అంటే అవుననే తెలుస్తోంది. నీట్, జేఈఈ ( NEET, JEE ) లాంటి పోటీ పరీక్షల్ని సకాలంలో నిర్వహించుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ని వీలైనంత త్వరగా నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై సీబీఎస్ఈ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ( Image courtesy : Representational image )
సీబీఎస్ఈ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడంతో పాటు, ఎగ్జామ్ ఫామ్స్-LOC ప్రక్రియను కూడా పూర్తి చేసినట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. సీబీఎస్ఈతో పరిధిలోకి వచ్చే పాఠశాలలన్నీ బోర్డు టైమ్ టేబుల్ ( CBSE exams 2021 time table ) ప్రకారం వీలైనంత త్వరగా సిలబస్‌ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ( Image courtesy : Representational image )
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఈ ఏడాదిలో 6 నెలలకుపైనే పాఠశాలలు మూతపడిన నేపథ్యంలో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా సిలబస్‌ని తగ్గించడం లేదా పరీక్షల్ని 45 రోజుల నుంచి 60 రోజులు ఆలస్యంగా నిర్వహించే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వెలువడుతున్న సంగతి తెలిసిందే. ( Image courtesy : Representational image )
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీ సమీప ప్రాంతాల్లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపల్స్ ( CBSE schools principals ) నుంచి అభిప్రాయాలు సేకరించగా.. వచ్చే ఏడాది సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తేనే బాగుంటుందని పాఠశాలల ప్రిన్సిపల్స్ తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. ( Image courtesy : Representational image )
సీబీఎస్ఇ పరీక్షలు వాయిదా వేసిన పక్షంలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు వారి పై చదువులకు, పలు ప్రవేశ పరీక్షలకు భంగం కలిగే ప్రమాదం ఉందని సీబీఎస్ఈ స్కూల్స్ ప్రిన్సిపల్స్ తమ అభిప్రాయాన్ని తెలిపారు. ( Image courtesy : Representational image )
సిబిఎస్ఇ పరీక్షల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంపై సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రస్తుతం అయోమయం నెలకొంది. ఇంతకీ సీబీఎస్ఈ ఏం నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాల్సిందే మరి. ( Image courtesy : Representational image )
Next Gallery