Yuzvendra Chahal Dhanashree Verma Divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇద్దరు అధికారికంగా స్పందించకపోయినా.. విడిపోవడం ఫిక్స్ అయిందంటూ సన్నిహితులు చెబుతున్నారు. ఇన్‌స్టాలో ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోడం.. చాహల్ తన అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఓ కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. అతడితో ధనశ్రీ క్లోజ్‌గా ఉండడంతో చాహల్ విడిపోవాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
గతేడాది హార్దిక్ పాండ్యా-నటాషా విడాకుల తరువాత మరో క్రికెటర్ చాహల్ విడాకులకు సిద్ధమవ్వడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. ధనశ్రీతో తాను కలిసి ఉన్న ఫొటోలను తొలగించిన చాహల్.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చేశాడు.
చాహల్-ధనశ్రీ మధ్య వివాదానికి కారణం ఓ కొరియోగ్రాఫర్ ప్రచారం జరుగుతోంది. ప్రతీక్ ఉటేకర్ అనే కొరియోగ్రాఫర్‌తో ధనశ్రీ డేటింగ్ చేస్తోందని రూమర్లు వస్తున్నాయి. వీరిద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్న ఫొటోను వైరల్ చేస్తున్నారు.
ఈ విషయంపై ప్రతీక్ ఉటేకర్ స్పందించాడు. ధనశ్రీతో తాను డేటింగ్ చేయడం లేదని.. కేవలం ఫొటోను చూసి బంధాన్ని అంచనా వేయవద్దని కోరాడు. కొంతమంది చాలా ఖాళీగా ఉంటారని.. ఫొటోలను చూసి కథలు రాస్తున్నారని ఇన్‌స్టా స్టోరీలో రాసుకువచ్చాడు.
ఇక ఈ రూమర్స్‌పై ధనశ్రీ స్పందించలేదు. చాహల్‌కు సపోర్ట్ చేస్తూ.. నెటిజన్లు ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధనశ్రీ స్పందిస్తూ.. తన మీద ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను సైలెంట్‌గా ఉన్నానంటే బలహీనంగా ఉన్నట్లు కాదని కౌంటర్ ఇచ్చింది.
ఇక ప్రతీక్ ఉటేకర్ విషయానికి వస్తే.. ముంబైలో ఓ టీవీ ఛానెల్‌లో డ్యాన్స్ రియాలిటీ షోతో కెరీర్ ప్రారంభించాడు. అక్కడ మంచి క్రేజ్ సంపాదించుకుని.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, నోరా ఫతేహి, సల్మాన్ ఖాన్ స్టార్లకు కొరియోగ్రఫీ నేర్పించాడు.
గతంలో కూడా వీరిద్దరు విడిపోతున్నారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఈ రూమర్స్‌ను చాహల్ కొట్టిపారేశాడు. కానీ ఈసారి మాత్రం రియాక్ట్ అవ్వలేదు.
తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించి.. రూమర్లకు మరింత బలం చేకూర్చాడు. అంతేకాదు మరో అమ్మాయితో జతకట్టి.. మద్యం మత్తులో ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి.