Zepto Success Story: సాధించాలన్న తపన ఉంటే..ఏదైనా సాధ్యమే. వయస్సుతో ప్రమేయం లేకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన తపన ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పుకోవడానికి జెప్టో సీఈవో ఆదిత్ పాలిచా నిదర్శనం. కాలేజీ డ్రాపవుట్ నుంచి నేడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. కోవిడ్ సమయంలో వచ్చిన చిన్న ఆలోచన ఆయన జీవితాన్నే మార్చేసింది. పదినిమిషాల్లో కావాల్సిన కిరాణ సామాన్లను ఇంటికి పంపిస్తున్న ఆదిత్ పాలిచా సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Zepto Success Story: ముంబై నగరంలో ఇద్దరు యువకులు.. అదిత్ పాలిచా, కైవల్య వోహ్రా. వీరిద్దరూ కోవిడ్ సమయంలో జెప్టోను ప్రారంభించారు. జెప్టో అనేది ఆన్ లైన్ కిరాణ డెలివరీ యాప్. ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే పది నిమిషాల్లోనే కిరాణా సరుకులు మన ఇంటికి అందిస్తుంది. ఈ కంపెనీ వాల్యుయేషన్ 140 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ.11,500 కోట్లకు చేరుకుంది. జెప్టో 2021 సంవత్సరంలో 10 లక్షల ఆర్డర్‌లను డెలివరీ చేసింది.
విజయం సాధించాలంటే.. కలలు కనడం చాలా ముఖ్యం అంటారు. ఎవరైతే కలలు కంటారో..ఆ కలలను సాకారం చేసే దిశగా తమ జీవితాన్నే వెచ్చిస్తారు. అలాంటి వారు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు. సరదాగా జీవితాన్ని గడిపే సమయంలో ఇద్దరు యువకుల్లో వచ్చిన ఆలోచన నేడు కోట్ల కంపెనీని సృష్టించారు. కరోనా సమయంలో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో జెప్టో ఆవిర్భవించింది. దీన్ని ప్రారంభించిన రెండేళ్లలోనే ఆ కంపెనీ యూనికార్న్ గా మారింది. కోవిడ్ సమయంలో చాలా మంది జెప్టోను ఒక వరంగా భావించారు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో సరుకులు అందించారు.
ఈ యాప్ ను కైవల్య వోహ్రా, అతని స్నేహితుడు ఆదిత్ పాలిచా ప్రారంభించారు. ఆన్‌లైన్ కిరాణా డెలివరీ స్టార్టప్ Zepto 2023 సంవత్సరంలో మొదటి యునికార్న్ స్టార్టప్‌గా మారింది. యునికార్న్ అంటే రూ. 100 కోట్లు లేదా ఒక బిలియన్ డాలర్లను దాటిన స్టార్టప్ లేదా కంపెనీ. కేవలం రెండేళ్లలో జెప్టో యూనికార్న్ కంపెనీగా అవతరించింది. జెప్టో వాల్యుయేషన్ 140 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ.11500 కోట్లకు చేరుకుంది. కోట్లాది రూపాయల విలువైన ఈ కంపెనీ ఇద్దరు యువకులే. అది కూడా 19సంవత్సరాల వయస్సులోపు వారే కావడం గమనార్హం.
జెప్టోను కైవల్య వోహ్రా, ఆదిత్ పాలిచా 2021లో ప్రారంభించారు.ఈ ఇద్దరు కూడా మంచి బిజినెస్ మ్యాన్ కావాలని కలలు కన్నారు. వీరిద్దరు పాఠశాల నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్నారు. అంతేకాదు వీరిద్దరూ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ ఏదో వెలితి. తిరిగి స్వదేశానికి వెళ్లిఏదూనా బిజినెస్ చేయాలని ప్లాన్ చేశారు. అంతే విమానం ఎక్కి ఇండియాకు చేరుకున్నారు.
ముంబైకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కూడా స్టార్టప్ గురించి ఆలోచించారు. ఒకసారి ఫుడ్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అయ్యింది. అక్కడే మొదలైంది వీరి స్టార్టప్ ఐడియా. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివలీ చేసినప్పుడు..కిరాణా సరుకులు ఎందుకు డెలివరీ చేయకూడదని ఆలోచించారు. అంతే వెంటనే జెప్టో ఆలోచన వచ్చింది.
ఏప్రిల్ 2021లో, ఆదిత్,కైవల్య వోహ్రా కిరాణా డెలివరీ కోసం వెబ్ ప్లాట్‌ఫారమ్ జెప్టోను స్థాపించారు. కేవలం ఒక నెలలోనే.. ఈ స్టార్టప్ విలువ $200 మిలియన్లకు చేరుకుంది.వీరి ఐడియా సక్సెస్ అయ్యింది. 2021 సంవత్సరంలో కంపెనీ 10 లక్షల ఆర్డర్‌లను డెలివరీ చేసింది.
జెప్టో ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం భారతదేశంలోని 10 అతిపెద్ద నగరాల్లో పనిచేస్తోంది. ఈ సంస్థ సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తోంది. దాని ప్లాట్‌ఫారమ్‌లో, కంపెనీ పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులతో సహా 3,000 విభిన్న ఉత్పత్తులను అందిస్తుంది.