HBD Prabhas: ఆ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసింది..

HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.

 

1 /10

ప్రభాస్ హ్యాండసమ్ పర్సనాలిటీతోనే కాదు...తనదైన నటనతో  ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకపక్క మిస్టర్ ఫర్ఫెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనూ ఉన్నాడు.  మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచాడు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్ లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు రెబల్ స్టార్. కసి, కోపం, ప్రేమ, యాక్షన్, ఎమోషన్ సీన్ ఏదైనా.. ఎంతో ఈజ్ తో చేయడం ప్రభాస్ స్పెషాలిటి.అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్  ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మారు మోగుతోంది.

2 /10

టాలీవుడ్ లో హీరోలు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పాలి. బాహుబలి సినిమా లాటరీ అన్నవాళ్లకు తన సినిమాలతో గట్టి సమాధానమే ఇచ్చాడు. అంతేకాదు ప్రస్తుతం మన దేశంలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్  సూపర్ స్టార్ గా ఎదిగాడు.

3 /10

ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ పరంగా.. ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల వరకు  పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు క్యూ కట్టడం ఓ స్పెషాలిటీ. ప్రభాస్ సినిమా విడుదల అవుతుంటే.. బాక్సాఫీస్ దగ్గర  డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ అన్ని లెక్కలు తీయడం మొదలు పెడతారు బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు.  

4 /10

సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. కొన్ని సినిమాలు క్యాస్ట్ ఫెల్యూలర్స్ గా నిలిచాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించాయి.

5 /10

వెయ్యి కోట్ల రూపాయల  గ్రాస్ క్లబ్.. రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల. అలాంటి సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల క్రాస్ మార్క్ అందుకున్న రీజనల్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. 

6 /10

బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్యర్యపోయేలా చేసింది.  ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో మంచి ఫలితాన్ని ఇచ్చింది.  కల్కి 2898 ఏడి మూవీ రూ.  1111 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.

7 /10

ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చన్న భరోసా కల్పించింది.  ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీగా నిలిచాయి. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నారు బడా బడా ప్రొడ్యూసర్స్.  

8 /10

మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘సలార్ 2’, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’  సినిమా...ప్రభాస్ చేస్తున్న బడా ప్యాన్ ప్రాజెక్ట్స్.  వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ షూటింగ్ దశలో ఉన్నాయి.

9 /10

ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పగా పలు సందర్బాల్లో రుజువు అయింది. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు రూ. 2 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు ప్రభాస్.

10 /10

అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం రూ. 2 కోట్ల రూపాయలు విరాళం అందించడం ప్రభాస్ పెద్ద మనసును తెలియజేస్తున్నాయి. అజాతశత్రువు అనే పాత మాటకు డార్లింగ్ అనే కొత్త అర్థాన్నిచ్చారు ప్రభాస్. రెబల్ స్టార్ స్టార్ డమ్, ఛరిష్మా తో పాటు ఈ మంచితనం ఆయనకు లోకల్ లెవ్ల నుంచి గ్లోబల్ వరకు  అభిమానులను సంపాదించి పెట్టింది. రెబెల్ ఫ్యాన్స్ అంతా ఈ రోజు ప్రభాస్ బర్త్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు.