JCB Video: పెద్ద సారు బురదలో కాలు పెట్టను అని జేసీబీ ఎక్కాడు.. కానీ
ఆయన ఒక పెద్ద సారు. నీట్ గా ఇన్ షర్టు వేసుకుని వరద ప్రభావిత ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో చూడటానికి బయల్దేరాడు.
ఆయన ఒక పెద్ద సారు. నీట్ గా ఇన్ షర్టు వేసుకుని వరద ప్రభావిత ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో చూడటానికి బయల్దేరాడు. కానీ మధ్య ఒక చిన్న బురదగుంట కనిపించింది. లోపల కాలు పెడితే పొద్దున్నే పాలిష్ చేసుకున్న షూ పాడు అవుతుంది అనుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. బురద అంటకుండా.. గుంట దాటాలి. దానికోసం ఆలోచించడం మొదలు పెట్టాడు.
అక్కడే ఉన్న చిన్న సారు కొత్తగా ఆలోచించాడు. పక్కనే ఉన్న జేసీబీ ( JCB ) హ్యాండ్ ఎక్కితే సులువుగా గుంట దాటొచ్చు అనుకున్నాడు. పెద్ద సారుతో పాటు జేసీబి హ్యాండ్ పై ఎక్కాడు. మెల్లిగా జేసీబీ హ్యాండ్ బురద గుంట పైనుంచి వారిని దాటించింది. ఇక దిగడమే అనుకునే సమయంలో.. జేసీబీ ఆగగానే పెద్ద సారు.. అయన కింద పని చేసే చిన్న సారు కాస్త అటూ ఇటూ కదిలారు. ఇంకేం వెంటనే బ్యాలెన్స్ చెడింది. ఢమాలుమని ఇద్దరూ కింద పడ్డారు. అది కూడా వారు కాలు పెట్టకూడదు అనుకున్న బురద గుంటలోనే.
ఇలా పడినందుకు పెద్ద సారు షూ మాత్రయే కాదు..ప్యాంటు షర్టు కూడా బురద అంటింది. ఈ వీడియో ( Viral Video ) చూసిన చాలా మంది బూట్లు పాడు కావొద్దు అనుకుంటే వాటిని విప్పి సంచిల పెట్టుకుని గుంట దాటితే బాగుండేది.. కానీ జేసీబితో ప్రయోగం ఏంది.. దేనితో ఏం పని అవుతుందో అదే పని చేయించాలి లేదంటే ఇలాగే ఉంటుంది అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) హల్చల్ చేస్తోంది..
ఇవి కూడా చదవండి
-
-
Dirty Money: నాలాలో నోట్ల వరద...ముక్కుమూసుకుని తీసుకుంటున్న స్థానికులు
-
Electric Rice Cooker: ఎలక్ట్రిక్ కుక్కర్ కొంటున్నారా ? ఇది చదవండి