Nirjala Ekadashi 2022: ప్రతి మాసంలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి ఉపవాసాలు పాటిస్తారు. ఈ అన్నింటిలో నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi 2022) ఉపవాసం అత్యంత కష్టతరమైన ఉపవాసాలలో ఒకటి. ఈ రోజున నీరు తాగకుండా, ఆహారం, పండ్లు తినకుండా ఉపవాసం చేయాలి. విష్ణువుతోపాటు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. నిర్జల ఏకాదశి నాడు చేసే దానానికి కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్జల ఏకాదశి రోజున దానం చేయడం వల్ల ఆ వ్యక్తికి ధన, ధాన్యాల కొరత ఉండదు. అలాగే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు దానం (Nirjala Ekadashi Daan) చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నిర్జల ఏకాదశి నాడు ఈ వస్తువులు దానం చేయండి
>> నిర్జల ఏకాదశి జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వస్తుంది. జ్యేష్ఠ మాసంలో తీవ్రమైన వేడి ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున చల్లటి వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. నీరు మరియు మట్టి పాత్రలు వంటివి అన్నమాట.
>> ఈ రోజు దాహంతో ఉన్నవారికి సిరప్ ఇవ్వడం లేదా నీరు తాగించడం మొదలైనవి చాలా శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.
>> నిర్జల ఏకాదశి రోజున పేదవారికి భోజనం పెట్టడం మంచిది. ఈ రోజున నీరు, బట్టలు, పాదరక్షలు, గొడుగు, ఫ్యాన్, పండ్లు మరియు ధాన్యాలతో నిండిన కలశం వంటి వాటిని దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది.
>> ఈ రోజున పప్పు మరియు బెల్లం దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో మాధుర్యం ఉంటుంది. అలాగే బ్రాహ్మణుడికి పాదుకలు దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుందని చెబుతారు. ఇలా చేయడం వల్ల మనిషి గ్రహ దోషాలు తొలగిపోతాయి.
>> ఈ రోజున నీళ్లతో కూడిన పండ్లు మరియు కూరగాయలను దానం చేయాలి. ఈ పండ్లలో మామిడి, దోసకాయ, లిచీ, సీతాఫలం మొదలైనవి ఉన్నాయి. వీటిని దానం చేయడం వల్ల మనిషికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
>> నిర్జల ఏకాదశి రోజున తులసి పూజ చేయండి
>> నిర్జల ఏకాదశి రోజున, లక్ష్మీ-నారాయణుల అనుగ్రహం పొందడానికి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని మరియు తులసిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది మరియు వ్యక్తి కెరీర్‌లో విజయం సాధిస్తాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
నిర్జల ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే... ఇగ మీ ఇంట కాసుల వర్షమే!