హైదరబాద్ రథసారధి.. అంబటి రాయుడు

హైదరాబాద్ టీ20 జట్టు కెప్టెన్‌గా అంబటి రాయుడు ఎంపికయ్యాడు.

Last Updated : Jan 2, 2018, 03:19 PM IST
హైదరబాద్ రథసారధి.. అంబటి రాయుడు

హైదరాబాద్ టీ20 జట్టు కెప్టెన్‌గా అంబటి రాయుడు ఎంపికయ్యాడు. త్వరలో సౌత్‌జోన్ అంతర టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ టీమ్‌కు రాయుడు సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 8 నుంచి 14 వరకు విశాఖపట్నంలో ఈ టోర్నీ జరుగనుంది. ఇటీవలే భారత జట్టుకు ఎంపికైన మహ్మద్ సిరాజ్, లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. 

2002-03 సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు రాయుడు. అలాగే టీమిండియా తరఫున 34 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 2014లో అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో తన తొలి సెంచరీ నమోదు చేసిన రాయుడు.. ఆ తర్వాత చివరిగా 2016లో జింబాబ్వే మీద ఆడాడు. ఆ తర్వాత పలుమార్లు టీ20 మ్యాచ్‌లు ఆడిన రాయుడు ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌కే అంకితమయ్యాడు

More Stories

Trending News