Greg Chappell feels Australia to win Border-Gavaskar Trophy 2023 against India: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. స్వదేశంలో టెస్ట్ సిరీస్ అనగానే.. సాధారణంగా భారత్ స్పిన్ పిచ్‌లకే ప్రాధాన్యం ఇస్తుందనే అంచనాలు అందరిలోనూ ఉంటాయి. దీంతో ఆసీస్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్లను ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారత్ కూడా నలుగురు స్పిన్నర్లను నెట్‌బౌలర్లుగా ఎంపిక చేసుకొంది. స్పిన్ పిచ్‌లు కాబట్టి భారత్ టెస్ట్ సిరీస్ గెలుస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ మాత్రం ఆసీస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్'తో గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ... 'బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2023ని ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడిన కారణంగా.. సొంతగడ్డపై కూడా టీమిండియా బలహీనంగానే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం భ్బరాత్ పూర్తిగా విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉంది. అందుకే ఈసారి ఆస్ట్రేలియానే సిరీస్ గెలుస్తుంది' అని జోస్యం చెప్పారు.
'విజిటింగ్ జట్లు పొసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిచ్‌లు స్వదేశీ జట్లకు అనుకూలంగా ఉంటాయి. భారత జట్టు స్పిన్ పిచ్‌లపై అలవాటు పడ్డారు. కాబట్టి ఆస్ట్రేలియా కూడా బ్యాట్ మరియు బాల్‌తో త్వరగా ఇక్కడి మైదానాలకు అలవాటుపడాలి. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈసారి అష్టన్ అగర్‌కు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. నాథన్ లియోన్‌తో కలిసి అగర్ రాణించగలడు' అని గ్రెగ్ చాపెల్ తెలిపారు.
టెస్ట్ క్రికెట్‌లో 619 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే కూడా చాలా అరుదుగా స్ట్రెయిట్‌గా బంతులు వేసేవాడని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నారు. జంబో వేగంగా, ఫ్లాట్ లెగ్ బ్రేక్‌లు వేస్తూ వికెట్లు పడగొట్టేవాడని అన్నారు. రవీంద్ర జడేజా కూడా దాదాపుగా ఇలానే బంతులు వేస్తాడని టీమిండియా మాజీ హెడ్ కోచ్ చెప్పారు. భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో చాపెల్ హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. 2020లో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
IND vs AUS: ఆస్ట్రేలియాదే బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2023.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియాదే బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ
టీమిండియా మాజీ హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం