/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Telangana MLA Quota MLC Elections Notification: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వీరిద్దరి స్థానాలకు జనవరి 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ఆధారంగా రెండు సీట్లలో ఒకటి దక్కనుండగా.. మరోకటి తమకు దక్కుతుందని బీఆర్ఎస్ ఆశించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌లో కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయంతో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం రెండు ఎమ్మెల్సీ సీట్లకు వేర్వేరుగా పోలింగ్ జరగనుంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు రెండు స్థానాల కోసం రెండు ఓట్ల వేయనున్నారు. 

దీంతో 65 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్ కూటమికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. వేర్వేరుగా కాకుండా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెరో సీటు దక్కేవి. ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాకింగ్‌లా మారింది. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పోలింగ్ ఒకేసారి నిర్వహించేలా ఈసీని ఆదేశించమని కోరే ఛాన్స్ ఉంది. మరోవైపు త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇలా..

==> నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 11
==> నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: జనవరి 18
==> నామినేషన్ల పరిశీలన: జనవరి 19
==> నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: జనవరి 22
==> MLC ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌: జనవరి 29

మరోవైపు త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు కూడా త్వరలో అవుతాయి. ఈ స్థానాల భర్తీకి ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. ఇటీవలే ఓటరు జాబితా షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైంది. పట్టభద్రులందరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనుండగా.. మార్చి 14 వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేయనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. 

Also Read:  ఆకట్టుకున్న ‘యాత్ర 2’ టీజర్.. మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథ

Also Read:  Vivo X100 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo X100 Pro మొబైల్‌పై రూ.30,000 తగ్గింపు..డిస్కౌంట్ వివరాలు ఇవే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Central Election Commission Big Twist in telangana mla quota mlc elections notification huge setback for BRS kr
News Source: 
Home Title: 

Telangana MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసీ బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్
 

Telangana MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసీ బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్
Caption: 
Telangana MLA Quota MLC Elections Notificati
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసీ బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, January 5, 2024 - 17:07
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
77
Is Breaking News: 
No
Word Count: 
303