టి.కాంగ్రెస్‌కు రెబల్స్ భయం ; గాంధీ భవన్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు

                                                  

Last Updated : Nov 12, 2018, 02:29 PM IST
టి.కాంగ్రెస్‌కు రెబల్స్ భయం ; గాంధీ భవన్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు

టి.కాంగ్రెస్ కు రెబల్స్ భయం వెంటాడుతోంది. అభ్యర్ధులను ప్రకటించక ముందే అభ్యర్ధులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద గత కొన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. ఈ నేఫథ్యంలో  పీసీసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెబల్స్ ఆందోళనన నేపథ్యంలో హైదరాబాద్ లోని టి పీసీసీ కార్యాలయం గాంధీభవన్ చుట్టూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 10 వాహనాలతో 100 మంది పోలీసులు.. భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల గాంధీభవన్ కు చెందిన  రెండు ప్రధాన గేట్లు మూసివేశారు. మరోవైపు పోలీసుల భద్రతతో పాటు ప్రైవేట్ సెక్రూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.

చివరి నిమిషయంలో ఏదైనా జరగొచ్చు..

మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. కూటమిలోని ఇతర పార్టీలకు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సీట్లును ఇతర పార్టీలకు కేటాయించారనే కారణంతో గత మూడు రోజుల నుంచి తమ అనుచరుతో రెబల్స్ ఆందోళన చేస్తున్నారు. ఆందోళన రూపంలో కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తీసుకురావాలని రెబల్స్ భావిస్తున్నారు. చివరి నిమిషమంలో మార్పులు ఉండవచ్చనే ఆశతో రెబల్ అభ్యర్ధులు ఇలా నిరసన తెలుపుతున్నారు. 

అంతా సర్దుకుంటుంది

మహాకూటమిలో భాగంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐకి సీట్లు కేటాయించిన నేపథ్యంలో రెబల్స్ ను బుజ్జగించేందుకు టి.కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ తో పాటు కార్పోరేషన్ పదువుల ఇస్తామని పలువురికి  హామీ ఇచ్చింది.  కాంగ్రెస్  పార్టీ తీసుకున్న చర్యలతో రెబల్స్ బెడద కొంత వరకు తగ్గిందని రాజకీయవర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ప్రస్తుతం నెలకొన్న వివాదం కూడా తుది జాబితా ప్రకటన తర్వాత చల్లబడవచ్చని పేర్కొంటున్నారు.

Trending News