Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. పట్టణ పేదలకు జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోనే ఆధునిక ఇళ్లు నిర్మించి అందిస్తామని స్పష్టం చేశారు. తొలివిడతగా లక్ష ఇళ్లకు త్వరలోనే శంకుస్థాపన జరగనుందని, వాటిని ఏడాదిలోపు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రకటనతో హైదరాబాద్ నగరంలోని అర్హులైన పేద కుటుంబాల్లో ఆశలు పెరిగాయి.
Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయ్యిందా..! ఈసారి విస్తరణలో ఐదుగురు నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారా..! ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు పదవుల భర్తీతో పాటు.. మరో ముగ్గురు మంత్రులకు ఏఐసీసీ పదవులు కట్టబెట్టి.. వారిస్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇదే విషయమై గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారా..! మరి మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి చోటు దక్కబోతుంది..! ఎవరెవర్ని తప్పించబోతున్నారు..!
Telangana Congress Nominated Posts: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ అగ్గి రాజేసింది..! నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని ఓ ఎంపీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు..! సూడా చైర్మన్ పోస్టును తన అనుచరుడికి కేటాయించాలని కోరినా.. పక్కన పెట్టడంతో గుస్సా అవుతున్నారా..! తన అసంతృప్తికి వెల్లడించేందుకు ఆ నేత రెడీ అవుతున్నారా..! ఇంతకీ ఎవరా నేత.. ఏంటా అసంతృప్తి కథా..!
KTR vs Balmuri Venkat: తెలంగాణ రాజకీయాలు ముదిరిపాకాన పడ్డట్లే కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రైతు సమస్యలపై కేటీఆర్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ తనదైన శైలిలో గట్టిబదులే ఇస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ తన హద్దులు దాటి మాట్లాడుతున్నారని.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరంటూ హెచ్చరించారు.
Big Good News To Telangana Congress Govt Of Telangana Nominated Posts: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీ శుభవార్త. అధిష్టానం 17 కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 28మందికి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి వచ్చాయో తెలుసుకుందాం.
Revanth Reddy Announced Congress Not Oppose Women Reservations: త్వరలో అమలుకానున్న మహిళా రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. అయితే దీని ద్వారా దక్షిణ భారతదేశానికి కొంత నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో చేసిన చిట్‌చాట్ ఇలా ఉంది.
New Strategy Of Telangana Congress With Whip Appointment: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రభుత్వ విప్ల నియామకం పూర్తవడంతో రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నియామకంపై నల్గొండ జిల్లాకు చెందిన నేతకు విప్ పదవి దక్కడంతో జిల్లాకు మినిస్ట్రీ లేనట్టే అన్న టాక్ వినిపిస్తోందా..! రాజ్ గోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకే వేముల వీరేశంకు పదవి ఇచ్చారని ప్రచారం జరుగుతోందా..!
Rahul Gandhi Alert To Telangana Congress For Alliance Continue With AIMIM: తెలంగాణలో కాంగ్రెస్-ఎంఐఎం పార్టీ దోస్తానా కొనసాగుతుండగా.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీ పార్టీ నాయకులను అలర్ట్ చేశారా..? దీని వెనుక ఉన్న అసలు కహానీ ఏంటి..!
Telangana Politics: తెలంగాణలో బీజేపీ మంచి జోష్ మీదుందా..! తమకు ఏ అవకాశం దక్కినా.. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోందా..! కామారెడ్డి, బాన్సువాడలో జరిగిన రెండు విషయాలపై బీజేపీ నేతల రియాక్షన్ చూసి సొంత పార్టీ నేతలే షాక్ అయ్యారా..! మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షం నుంచి తప్పించేందుకే.. కాంగ్రెస్- బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోందా..!
Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్ లో వాళ్లిద్దరూ కీలక నేతలు..! కొద్దిరోజులుగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు..! ప్రభుత్వంలో కీలక పదవులు వస్తాయని ఆశపడ్డ వారికి ఏ పదవి దక్కడం లేదు..! దాంతో స్వపక్షంలోనే విపక్షంలా మారిపోయి.. విమర్శలకు దిగుతున్నారు..! ఇప్పుడు ఈ నేతల అసంతృప్తిని హైకమాండ్ గుర్తించిందా..! త్వరలోనే వీరిని ఢిల్లీకి పిలిచి వారి కోరిక తీరుస్తారనే టాక్ వినిపిస్తోందా..!
Telangana News: తెలంగాణలో కొందరు అసంతృప్త లీడర్లపై హైకమాండ్ సీరియస్ గా ఉందా..! మున్సిపల్ ఎన్నికల్లో పార్టీపై తిరుగుబాటు చేసిన నేతలను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్దం అవుతోందా..! పలుమార్లు వారించినా మాటవినకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తేనే.. మిగతా వాళ్లు దారికొస్తారని భావిస్తున్నారా..! అయితే పార్టీలో నుంచి సస్పెండ్ కాగానే.. ఆ నేతలు గులాబీ కండువాలు కప్పుకునేందుకు రెడీ అవుతున్నారా..!
cm Revanth reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. యాసిడ్ వేసి బీఆర్ఎస్ పార్టీ మోలవకుండా చేయాలన్నారు. కేటీఆర్ పై అనుమానం కల్గుతుందని ఆయన సోయి లేకుండా నోటికి ఎటుపడితే అటు మాట్లాడుతున్నాడని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వంనుంచి అన్ని వసతులు పొందుతున్నాడన్నారు.
Danam nagender shocking comments on mlas party disqualification row: ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్యెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలీదని తాను మాత్రం ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా గ్రేటర్ లో కాంగ్రెస్, ఏంఐఏలంలు విజయ ఢంకా మోగిస్తాయన్నారు.
Big Fight For Sangareddy DCC Post: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకాలు మొదలవగా.. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు నాయకుల మధ్య వివాదం ఏర్పడడంతో మంత్రి ఉన్నా కూడా అతడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అదెక్కడో తెలుసుకుందాం.
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు నలుగురు మంత్రులను తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.
Naveen Yadav profile: మూడు సార్లు వరుసగా ఓటమి ఎదురైనా వెనక్కు తగ్గడం నవీన్ యాదవ్ స్వభావంలో లేదు. ప్రతి ఓటమి ఆయనకు మరింత బలం ఇచ్చింది. ప్రతి అపజయం ఆయనను ప్రజలకు దగ్గర చేసింది. చివరికి ఇదే ధైర్యం, ఇదే పట్టుదల ఆయనను జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటంలా ముందుకు నడిపింది. సంవత్సరాలుగా రాజకీయ రంగంలో పోరాడుతూ వచ్చిన నవీన్, ఒక్కో ఎన్నికలో ఓడినప్పుడు వదిలేయకుండా .. మరి కొంత నేర్చుకుని, మరింత ప్రజలలో కలిసిపోయి.. చివరకు తానే గెలిచే రోజును సృష్టించుకున్నారు. ఈ ఉపఎన్నికల్లో ఆయన సాధించిన భారీ మెజార్టీ, ఒక సాధారణ విజయం కాదు.. అది ఓటములను అవకాశం గా మార్చుకున్న నాయకుని పట్టుదలకి నిదర్శనం. జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనను తమ మనిషిగా చూసారు. స్థానిక సమస్యలు, వారి కష్టాలు, వారి ఆశలు.. ఇవన్నీ దగ్గరగా విన్న అభ్యర్థిగా ఆయన పేరు నిలిచింది. అందుకే ఈసారి ఓటర్లు ఏ సందేహం లేకుండా, పెద్ద సంఖ్యలో ఆయనకు తమ మద్దతు తెలిపారు.
Minister Konda Surekha Controversy: మంత్రి కొండా సురేఖ వివాదాన్ని బీసీ, రెడ్ల కులాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉందని రెడ్డి జాగృతి ప్రెసిడెంట్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఈ వివాదం కులాల మధ్య చిచ్చు పెట్టడం సమజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌ని తాను కలిశానని మంత్రి కొండా సురేఖ చెప్పారు. తాను చెప్పాల్సినవి అన్నీ చెప్పానని ఆమె వెల్లడించారు. జరుగుతున్న పరిణామాలపై పెద్దలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Naveen Yadav's Background: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం యువ నాయకుడు నవీన్ యాదవ్ ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం మరియు హైకమాండ్ రెండూ నిర్ణయించాయి.
Group Politics Out In Congress Party And Facing Trouble: వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ రాజుకుందా..! భద్రాకాళి ఆలయం పాలకమండలి వ్యవహారం నేతల్లో ఆధిపత్య పోరును మరోసారి బయటపెట్టిందా..! వరంగల్ ప్రజాపాలన దినోత్సవానికి నేతలంతా ముకుమ్మడిగా డుమ్మా కొట్టారా..! కొండా సురేఖను ఒంటరి చేశామనే సంకేతాలను పంపించారా..!
Congress High Command: కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఒక రాష్ట్రంలో ఒకలా.. మరో రాష్ట్రంలో మరోలా ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యవహారిస్తోన్న తీరు గురించే మాట్లాడుకుంటున్నారు.
Telangana Congress: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకున్న సందిగ్థతకు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరదించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ తన తరపున పోటీ చేసే అభ్యర్థుల్లో 42శాతం సీట్లను బీసీ వర్గాలకు కేటాయించి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం గాంధీభవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలు చర్చించారు.