తెలంగాణ కాంగ్రెస్ సీట్ల కేటాయింపులో కొన్ని సామాజికవర్గాలకు న్యాయం జరిగితే..మరికొన్ని సామాజికవర్గాలకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి ఒక్క స్థానం కూడా లభించలేదు. దీంతో ఆ వర్గానికి చెందిన రేణుకాచౌదరితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఒక సీటును కూడా కేటాయించకుండా తమ సామాజికవర్గానికి తీరని అన్యాయం చేశారంటూ తమ ఆవేదనను బహిర్గతం చేశారు.
ఎన్నికల సమయంలో ఇలాంటి అసంతృప్తి ఉండకూడదనే భావించిన రాహుల్ గాంధీ నష్టనివారణ చర్యలు చేపట్టారు. బుజ్జగింపుల్లో భాగంగా కమ్మ సామాజికవర్గానికి టి.కాంగ్రెస్ కీలక పదవి కట్టబెట్టారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ ప్రకారం కమ్మ సామాజికవర్గానికి చెందిన జెట్టి కుసుమకుమార్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నియమించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ టి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. తాజా నియామకంతో వర్కింగ్ ప్రెసిండెంట్ల సంఖ్య మూడుకు చేరుకుంది.
Congress President Rahul Gandhi appoints Jetti Kusum Kumar as Working President of Telangana Pradesh Congress Committee pic.twitter.com/fKqZSmKXdE
— ANI (@ANI) November 15, 2018
బ్రేకింగ్ న్యూస్: కమ్మ సామాజికవర్గానికి టి.కాంగ్రెస్‌లో కీలక పదవి