పిల్లల కోసం ఎగ్‌ రోల్స్‌.. వదలకుండా తింటారు!

';

ప్రస్తుతం చాలా మంది ఎగ్‌లను తినేందుకు ఇష్టపడరు.

';

ఎగ్‌ రోల్స్‌ చాలా రుచికరమైన స్నాక్స్. వీటిని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

ఉడక బెట్టిన గుడ్లు తినని వారికి ఇలా ఎగ్‌ రోల్స్‌ చాలా నచ్చుతుంది.

';

ఎగ్‌ రోల్స్‌ను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని ఎలా తయారు చేయాలో తెలుసా?

';

ఎగ్‌ రోల్స్‌ను ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి..

';

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 2 కప్పులు, గుడ్లు - 2, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి

';

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ - 1 (తరిగినది), కీర - 1 (తరిగినది), దోసకాయ - 1 (తరిగినది), నిమ్మకాయ - 1/2 (రసం)

';

కావలసిన పదార్థాలు: మిరియాల పొడి - రుచికి సరిపడా, చాట్ మసాలా - రుచికి సరిపడా, టమాటో సాస్ - రుచికి సరిపడా, చిల్లీ సాస్ - రుచికి సరిపడా

';

తయారీ విధానం: ఒక బౌల్‌లో గోధుమ పిండిని తీసుకొని, అందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలపండి.

';

తగినంత నీరు, కొద్దిగా నూనె వేసి ముద్దలా చేసుకోండి. ఈ ముద్దను ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి.

';

అరగంట తర్వాత, ముద్దను కావలసిన సైజులో బాల్స్‌గా తీసుకొని చపాతీలుగా చేసుకోండి.

';

ఒక బౌల్‌లో రెండు గుడ్లను కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి.

';

స్టవ్‌పై ఒక పెనం పెట్టి, నూనె వేడి చేయండి. వేడి చేసిన పెనంలో చపాతీని వేసి రెండు వైపులా బాగా కాల్చుకోండి.

';

అదే పెనంలో కొంచెం నూనె వేసి, బీట్ చేసిన గుడ్లను పోసి, మనం చేసుకున్న చపాతీ సైజులో ఆమ్లెట్‌గా వేయించుకోండి.

';

ఆమ్లెట్ కొంచెం కాలిన తర్వాత.. రెడీ చేసుకున్న చపాతీని దానిపై పెట్టుకోండి.

';

చపాతీపై ఉల్లిపాయ, కీర, దోసకాయ, నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలా, టమాటో సాస్, చిల్లీ సాస్ వేసి రోల్ చేసుకోండి.

';

అంతే సులభంవగా రుచికరమైన ఎగ్‌ రోల్స్‌ సిద్ధం!

';

VIEW ALL

Read Next Story