అమెరికా: సుప్రీంకోర్టు జడ్జిగా కావెనా ప్రమాణం

అమెరికా: సుప్రీంకోర్టు జడ్జిగా కావెనా ప్రమాణం

Updated: Oct 9, 2018, 10:02 PM IST
అమెరికా: సుప్రీంకోర్టు జడ్జిగా కావెనా ప్రమాణం

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివాదాస్పద అభ్యర్థి బ్రెట్ కావెనా సుప్రీం కోర్టు 114వ న్యాయ‌మూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కొన్ని రోజులుగా సాగిన చర్చలు, వివాదాల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సెనెట్ సభలో జరిగిన ఈ అభ్యర్థిత్వంపై ఓటింగ్ లో కావెనాకు అనుకూలంగా 50 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 48 ఓట్లు పడడంతో కావానా నియామకం ఖరారైంది. దీంతో ఆదివారం సాయంత్రం ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణం చేయించారు.

అంతకు ముందు సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన బ్రెట్ కావెనాపై ఎఫ్‌బీఐ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించారు.  కావెనాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని.. డెమోక్రాట్ల వ్యతిరేకతను కావెనా సమర్థంగా ఎదుర్కొన్నారని వ్యాఖ్యానిస్తూ ట్రంప్..  సెనెట్ సభలో ఆయనకు అనుకూలంగా ఓటేశారు.

కావానా హైస్కూల్, కాలేజి విద్యార్థిగా ఉన్న రోజుల్లో తమతో అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు మహిళలు ఆరోపణలు చేయడం, ఇతర అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కావెనా అభ్యర్ధిత్వం వివాదాస్పదంగా మారింది.  అయితే అన్ని ఆరోపణలను ఆయన తిరస్కరించారు.

అటు ఓటింగ్‌కు ముందు వందలాది మంది కావెనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాషింగ్టన్‌లోని యూఎస్ కేపిటల్ ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొందరు 'స్టాట్యూ ఆఫ్ జస్టిస్' పైకెక్కి నినాదాలు చేశారు.

కావెనా ప్రమాణానికి ముందు ట్రంప్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. అమెరికా సుప్రీం కోర్టుకు కావెనాను ఎంపిక చేసినందుకు సెనేట్‌కు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.