WHO: కరోనావైరస్ పుట్టుక తెలుసుకోవడానికి WHO టీమ్ ఏం చేసిందో తెలుసా ?
కరోనావైరస్ పుట్టుక (The Genesis Of novel Coroanvirus ) గురించి తెలుసుకోవడానికి WHO టీమ్ ఏం చేసిందో వెల్లడించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
కరోనావైరస్ జన్మస్థలం అయిన చైనాకు చేరుకున్న WHO టీమ్ చైనా అధికారులతో సీరియస్ గా చర్చలు చేసింది. దాంతో పాటు వుహాన్ లో ( Wuhan ) ఉన్న శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. కరోనావైరస్ ( Coronavirus ) పుట్టుక గురించి తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) టీమ్ చైనా ( China) వెళ్లింది. ఈ టీమ్ ఏం వెల్లడిస్తుందో అని ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురు చూస్తోంది.
Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ? రాముడి పాలన ఎలా సాగింది?
అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) చైనాకు అనుకూలంగా ప్రవర్తించడం వల్లే నేడు ప్రపంచం కోవిడ్-19 వైరస్ తో సతమతం అవుతోంది అని నిందించారు. చైనాకు వ్యతిరేఖంగా చర్యలు తీసుకోకుంటే World Health Organisation పై తను చర్యలు తీసుకుంటాను అని హెచ్చరించాడు ( Trump Warns WHO ) ట్రంప్.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనా టీమ్ లో ఉన్న క్రిస్టియన్ లిండ్ మేర్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ మహహ్మారి పుట్టుక ( The Genesis Of Coronavirus ) గురించి తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుమోసిన శాస్త్రవేత్తలు టీమ్ లో సభ్యులుగా చేరారు.
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
అడ్వాన్స్ టీమ్ చైనా వైద్యులు, అధికారులతో వైరస్ గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పమని కోరి.. వారి నుంచి విలువైన సమాచారం సంపాదించిందట.
ఈ మహమ్మారిపై అధ్యయనం, బయోలాజికల్, జెనిటికల్ ఎనాలిటిక్స్ పై తాజా సమాచారం తీసుకున్నారట. దాంతో పాటు చైనాలో పశువుల ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారని సమాచారం.
WHO నియమించిన ఈ టీమ్ త్వరలోనే కోవిడ్-19 పుట్టుక ( The Genesis Of Coronavirus Pandemic ) గురించి తెలుసుకుంటుంది అని... నావెల్ కరోనావైరస్ ఎలా జన్మించిందో అనే రహస్యాన్ని ఛేధిస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ సారి చైనా అధికారులతో సీరియస్ గా చర్చించినట్టు తెలుస్తోంది.
Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు