ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..తెలుగు రాష్ట్రాల్లో యథాతథం

Last Updated : Sep 30, 2017, 03:42 PM IST
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..తెలుగు రాష్ట్రాల్లో యథాతథం

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశాయి. ఇప్పటి వరకు తమిళనాడుకు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యహరించిన విద్యాసాగర్ రావుకు మహారాష్ట్రకే పరిమితం చేశారు. కాగా తమిళనాడు గవర్నర్ గా భన్వరిలాల్ పురోహిత్‌ను నియమించారు. వీరితో పాటు మేఘాలయ గవర్నర్ గా గంగా ప్రసాద్ నియమితులయ్యారు. అరుణాచల్ గవర్నర్ గా బీడీ మిశ్రాను నియమించారు. బీహార్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్, అసోం గవర్నర్ గా జగదీష్ ముఖీని నిమించారు. కాగా కేంద్ర పాలిత ప్రాంతమైన అమండమాన్ నికోబార్ దీవులకు దేవేంద్రకుమార్ ని లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్ర పతి ఉత్వర్వులు జారీ చేశారు. దరస పండగ రోజు ఈ గవర్నర్ల నియామకం చేపట్టడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించనున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తరణంలో నరసింహన్ నే కొనసాగించాలని కేంద్ర భావించింది. అందుకే ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ కొనసాగనున్నారు.

Trending News