ఏపీలో ఇకపై రూ.149కే హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్

సాధారణ ధరకే రాష్ట్రంలో ఇంటింటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన..

Last Updated : Dec 27, 2017, 05:02 PM IST
ఏపీలో ఇకపై రూ.149కే హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్

సాధారణ ధరకే రాష్ట్రంలో ఇంటింటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ పథకం అమలు ద్వారా ఇంటర్నెట్ సేవలతోపాటు కేబుల్ టీవీ, టెలిఫోన్ సౌకర్యం కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. 
ఫైబర్ గ్రిడ్ పథకం ప్రత్యేకతలు:
> రూ.149కే ఇంటింటికీ 15 Mbps వేగంతో  హై - స్పీడ్ ఇంటర్నెట్ సేవలు.
> ఒకే కనెక్షన్‌తో కేబుల్ టీవీ (350కి పైగా ఛానెళ్లు), అద్దె లేకుండా టెలిఫోన్ సేవలు. 
> 1.3 కోట్ల గృహాలు, 50,000 పాఠశాలలు, 10,000 ప్రభుత్వ కార్యాలయాలకి ఫైబర్ గ్రిడ్ సేవలు.
> 5,000 ప్రజా ఆరోగ్య వైద్య కేంద్రాలకి ఫైబర్ గ్రిడ్ సేవలు
> రూ.999కే వాణిజ్య సంస్థలకి 100 Mbps వేగంతో  హై - స్పీడ్ ఇంటర్నెట్ సేవలు.
> రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2,464 సబ్‌స్టేషన్స్‌ని అనుసంధానం చేస్తూ 23,800 కి.మీ మేర విస్తరించనున్న ఫైబర్ గ్రిడ్ కేబుల్.
> రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కెమెరాలని అనుసంధానిస్తూ నిఘా.

ఇప్పటికే 1,10,367 గృహాలు, 3246 వాణిజ్య సంస్థలకి కనెక్షన్ అందించడం పూర్తయినట్టు ప్రాజెక్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వేల్పురి వేణు మీడియాకు తెలిపారు. ఈ రోజు ఉదయం 11:45 గంటలకి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయం ప్రాంగణంలోని వేదికపై నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

Trending News