గుడ్ న్యూస్.. మారుతీ జిమ్నీపై రూ.1 లక్ష వరకు ఆఫర్.. 10 రోజులు మాత్రమే!

SUV మరియు థార్‌కి పోటీగా మారుతి జిమ్నీని విడుదల చేసింది. పండుగ సందర్భంగా జిమ్నీపై ఒక లక్ష రూపాయల వరకు ఆఫర్ ఉందని ఆటోకార్ఇండియా నివేదిక వెల్లడించింది. జిమ్నీ ఫీచర్స్, ధర మరియు ఆఫర్ల వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 06:42 PM IST
గుడ్ న్యూస్.. మారుతీ జిమ్నీపై రూ.1 లక్ష వరకు ఆఫర్.. 10 రోజులు మాత్రమే!

Rs 1 Lakh Discount Offers on Maruti Jimny: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి నుండి భారతీయ మార్కెట్లో ఇటీవలే విడుదలైన వాహనం జిమ్నీ. SUV మరియు మహీంద్రా థార్ కు పోటీగా జిమ్నీని మారుతి తీసుకొచ్చింది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా జిమ్నీ 3 డోర్స్ అందుబాటులో ఉంటే.. కానీ కేవలం మన భారత దేశంలో మాత్రమే 5 డోర్స్ జిమ్నీ అందుబాటులో ఉంది. ఈ 5 డోర్ల జిమ్నీ మన దేశంలో మాత్రమే తయారు చేయబడుతుంది మరియు బయటి దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది. జిమ్నీకి మన దేశంలో మంచి స్పందన లభిస్తుంది. కావున పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మారుతి సుజుకి నెక్సా డీలర్లు జిమ్నీ యొక్క ఎంట్రీ-లెవల్ జీటా వేరియంట్‌పై రూ. 1 లక్ష వరకు ఆఫర్‌లను అందిస్తున్నారు.

ఆఫర్లు.. 
ఆటోకార్ఇండియా వెల్లడించిన నివేదికల ప్రకారం.. జిమ్నీ జీటా ప్రస్తుతం రూ. 50,000 ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉందని, దీనితో పాటుగా అదనంగా రూ. 50,000 ఎక్స్ఛేంజ్ లేదా లాయల్టీ బోనస్ ఆఫర్‌పై ఉందని వెల్లడించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్లు జీటా వేరియంట్ యొక్క మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్‌లకు వర్తించనుంది. 

ధర.. 
జిమ్నీ జీటా అనేది జిమ్నీ లైనప్‌లో ఎంట్రీ-లెవల్ వేరియంట్. దీని ధర రూ. 12.74 లక్షలు (మాన్యువల్) మరియు రూ. 13.94 లక్షలు (ఆటోమేటిక్) లో అందుబాటులో ఉంది. ఇది టాప్-స్పెక్ జిమ్నీ ఆల్ఫా వలె అదే టాప్-స్పెక్ జిమ్నీ ఆల్ఫాలో 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజన్‌ వస్తుంది. ఇందులో ఇది 4WD సెటప్‌తో వస్తుంది.

Also Read: Bhagavanth Kesari : హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలకృష్ణ.. దసరా విన్నర్ షురు..

ఫీచర్లు.. 
ఫీచర్ల విషయానికొస్తే.. జిమ్నీ జీటాలో స్టీల్ వీల్స్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 6 ఎయిర్‌ బ్యాగ్‌లు మరియు ESP మరియు అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. జిమ్నీ మారుతి సంస్థ యొక్క ప్రీమియం ఉత్పత్తి. జిమ్నీ లాంచ్ చేసినప్పటి నుండి ప్రతి నెల దాదాపు 3,000 యూనిట్లు అమ్ముడవుతునట్లు  మారుతి సంస్థ తెలిపింది.

Also Read: AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News