'రంగస్థలం నుంచి రంగమ్మత్త'గా యాంకర్ అనసూయ ఫస్ట్ సెల్ఫీ ఇదే

రంగస్థలం సినిమా ఆడియెన్స్ ముందుకు రావడానికి మరో రెండు రోజులే మిగిలి వుందన్న తరుణంలో ఆ సినిమాలో నటించిన యాంకర్ అనసూయ ఓ ఆసక్తికరమైన ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 

Last Updated : Mar 28, 2018, 09:58 PM IST
'రంగస్థలం నుంచి రంగమ్మత్త'గా యాంకర్ అనసూయ ఫస్ట్ సెల్ఫీ ఇదే

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఆడియెన్స్ ముందుకు రావడానికి మరో రెండు రోజులే మిగిలి వుందన్న తరుణంలో ఆ సినిమాలో రంగమ్మ పాత్రలో నటించిన యాంకర్ అనసూయ ఓ ఆసక్తికరమైన ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. రంగమ్మత్త పాత్ర కోసం ఆ సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు తీసుకున్న మొదటి సెల్ఫీని ట్విటర్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది అనసూయ. రంగస్థలం సినిమా కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా వేచిచూస్తోన్న క్రమంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ సెల్ఫీ చెర్రీ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ 'చిట్టిబాబు' అనే పల్లెటూరి యువకుడి పాత్రలో నటించగా అతడి సరసన 'రామలక్ష్మి' అనే పల్లటూరి పడుచు పిల్ల పాత్రలో సమంత కనిపించనుంది.

 

 
సుకుమార్-రామ్ చరణ్-సమంత లాంటి ముగ్గురు క్రేజీ స్టార్స్ కాంబినేషన్‌లో మొదటిసారిగా వస్తున్న సినిమా కావడంతో 'రంగస్థలం'పై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే వున్నాయి. దీనికితోడు 'రంగస్థలం' కోసం రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సైతం మ్యూజిక్ లవర్స్‌ని విశేషంగా అలరిస్తోంది. 'ఎంత సక్కగున్నావే'..., 'రంగమ్మా.. మంగమ్మా'..., 'రంగ రంగ రంగస్థలానా'..., వంటి పాటలకు ఇప్పటికే ఇంటర్నెట్‌లో విపరీతమైన స్పందన కనిపిస్తోంది. ఇక వీటన్నింటికి తోడుగా తాజాగా యాంకర్ అనసూయ పోస్ట్ చేసిన రంగమ్మత్త సెల్ఫీ సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

 

Trending News