Bahubali Crown of blood animation Trailer: ఆకట్టుకుంటున్న బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ట్రైలర్.. ఈ నెల 17న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌..

Bahubali Crown of blood animation Trailer: బాహుబలి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. అందేకాదు మన దేశంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తాజాగా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో యానిమేటేడ్ కథతో  కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. దానికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2024, 07:50 PM IST
Bahubali Crown of blood animation Trailer: ఆకట్టుకుంటున్న బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ట్రైలర్.. ఈ నెల 17న  డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌..

Bahubali Crown of blood animation Trailer: భారతీయ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన బాహుబలి రెండు పార్టులుగా తెరకెక్కి భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తాజాగా  ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా..జీవన్ జె. కాంగ్,  నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ మే 17వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు.

అంతేకాదు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్ విడుదల చేశారు.  మాహిష్మతి రాజ్యాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచేయాలని యుద్ధానికి దిగిన రక్త్ దేవ్‌ను బాహుబలి, భల్లాలదేవుడు కలిసి వీరోచితంగా ఎదుర్కోవడం ట్రైలర్ లో ఆకట్టుకుంది. ప్రతి పాత్రలో ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సులు సిల్వర్ స్క్రీన్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేలా తెరకెక్కించారు.

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ కంటెంట్ హెడ్  గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ - బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌తో ఐకానిక్ ఫ్రాంచైజీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా  ఉంది. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఈ సిరీస్ తో ఆకర్షించడం పక్కా అని చెబుతున్నానరు. ఈ సిరీస్ తో గ్రాఫిక్ ఇండియాతో హాట్ స్టార్ రిలేషన్ మరింత బలోపేతం అవుతుందన్నారు.

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ -బాహుబలి ప్రపంచం ఎంతో విశాలమైంది.  ఈ ఫిల్మ్ ఫ్రాంచైజీ ఆ ప్రపంచాన్ని సరైన విధంగా పరిచయం చేస్తుంది. ఈ కథలో తెలుసుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయి. ఈ కథ మొదటిసారిగా బాహుబలి, భల్లాలదేవ జీవితాలలో తెలియని అనేక మలుపులను తెలియజేస్తుంది. ఈ ఇద్దరు సోదరులు మాహిష్మతిని రక్షించడానికి చేసిన వీరోచిత పోరాటం ఈ సిరీస్ లో చూపించనట్టు తెలిపారు. బాహుబలి అభిమానులకు ఈ కొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తున్నందుకు, ఈ కథను యానిమేషన్ ఫార్మాట్‌లో తీసుకు రావడానికి మేం చాలా సంతోషిస్తున్నట్టు తెలిపారు.  

హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ఈ సిరీస్ తో బాహుబలి ఫిల్మ్ ఫ్రాంచైజీ తన స్క్రీన్ మ్యాజిక్ కొనసాగిస్తోందన్నారు. యానిమేషన్ లో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ రూపొందడం  ఎంతో హ్యాపీగా ఉందన్నారు. బాహుబలి, భల్లాలదేవ్ జీవితం యొక్క ఈ కొత్త అధ్యాయం బాహుబలి ప్రపంచంలోని మరెన్నో రహస్యాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుందన్నారు.

ఇదీ చదవండి: ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x