కరోనావైరస్ ( Coronavirus ), సంజయ్ దత్ ( Sanjay Dutt ) అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు కేజీఎఫ్2 ( KGF Chapter 2) షూటింగ్ ను ఇబ్బంది పెట్టినా... దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం మిగితా పార్ట్ పూర్తి చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అధీరా పాత్ర చేస్తున్న సంజయ్ దత్ ఆరోగ్యం సరిగ్గా లేనందు వల్ల ఆగస్టు 26  నుంచి ప్రారంభం అయ్యే షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో యష్ ( Yash ) -సంజూ మధ్య ప్లాన్ చేసిన ఒక భారీ ఫైట్ సీన్ ను వాయిదా వేశారట. అధికారిక స్టేట్మెంట్ ప్రకారం ఇక ఆగస్టు 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.



యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1 జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. ఈ మూవీలో యష్ యాటిట్యూడ్, ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) మేకింగ్ అన్ని ప్రేక్షకులను అలరించాయి. హిందీ ప్రేక్షకులు కూడా కేజీఫ్ 1 ను చాలా ఇష్టపడ్డారు. దాంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై దర్శకనిర్మాతలు బాగా ఫోకస్ పెడుతున్నారు.  ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


[[{"fid":"191328","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"KGF2a.png","field_file_image_title_text[und][0][value]":"KGF2a.png"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"KGF2a.png","field_file_image_title_text[und][0][value]":"KGF2a.png"}},"link_text":false,"attributes":{"alt":"KGF2a.png","title":"KGF2a.png","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇవి కూడా చదవండి