Malayalam Director siddique Passed away: భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధీక్(63) గుండెపోటుతో కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులగా అనారోగ్యం కారణంగా కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సిద్ధీక్. అయితే సోమవారం ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని.. మంగళవారం రాత్రి 9.13 గంటలకు సిద్ధీక్ మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. సిద్ధీక్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
సిద్ధీక్.. 1960 ఆగస్టు 01 కొచ్చిలో జన్మించారు. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత సీనియర్ దర్శకుడు ఫాజిల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్లు పనిచేసారు. ఆ తర్వాత తన స్నేహితుడు లాల్ తో కలిసి సినిమాలు తీయడం మెుదలుపెట్టాడు సిద్ధీక్. వీరిద్ధరూ తీసిన రామ్జీరావు స్పీకింగ్, గాడ్ ఫాదర్, ఇన్ హరిహర్ నగర్, వియత్నాం కాలనీ, కాబూలీ వాలా వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇండస్ట్రీలో వీరిద్దరి జంట సిద్ధీక్-లాల్ గా గుర్తింపు పొందింది. అంతేకుకాండా సిద్ధీక్.. హిట్లర్, ఫ్రెండ్స్, క్రానిక్ బ్యాచిలర్, బాడీగార్డ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం చేశారు. ఈయన 2011లో తెరకెక్కించిన బాడీగార్డ్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ హీరోగా హిందీ, వెంకటేశ్ హీరోగా తెలుగులో, విజయ్ హీరోగా తమిళ్ లో రీమేక్ చేసి విజయం సాధించారు మేకర్స్. తెలుగులో నితిన్ హీరోగా నటించిన 'మారో' చిత్రానికే ఈయనే దర్శకుడు.
Also Read: 1134 Movie Trailer: ఏటీఎం రాబరీ నేపథ్యంతో వస్తోన్న నో బడ్జెట్ సినిమా '1134'
సిద్ధీక్ కు భార్య సజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని కొచ్చిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ఉంచనున్నారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Also Read: Devara Movie Update: భారీ సొర చేపతో తలపడనున్న ఎన్టీఆర్.. ఛత్రపతిని మించి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook